‘ఎన్జీకే’ దర్శకుడిపై సెటైర్లే సెటైర్లు

‘ఎన్జీకే’ దర్శకుడిపై సెటైర్లే సెటైర్లు

తన కొత్త సినిమా ‘ఎన్జీకే’పై సూర్య చాలా ఆశలే పెట్టుకున్నాడు. అతడి ఫ్యాన్స్ అయితే ీ సినిమా విషయంలో మామూలు ఉత్సాహంతో కనిపించలేదు. వరుసగా సూర్య నుంచి యావరేజ్ సినిమాలే వస్తున్నాయని.. ఈసారి బ్లాక్ బస్టర్ ఖాయమని ఆశించారు. కానీ ‘ఎన్జీకే’ వారి ఆశల్ని చిదిమేసింది. సూర్య నటించిన గత సినిమాలు ఎంత నయమనిపించింది.

సూర్య కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ‘ఎన్జీకే’ పెద్ద డిజాస్టర్ దిశగా సాగుతోంది. ఐతే తన సినిమాలు హిట్టయినప్పుడు కూడా సైలెంటుగా కనిపించే దర్శకుడు సెల్వ రాఘవన్.. ఈ సినిమా విషయంలో ఘనంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో సూర్య అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులకు కూడా మంట పుట్టేలా చేస్తోంది.

‘ఎన్జీకే’ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన వస్తోందని.. ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు కృతజ్నతలని అన్నాడు సెల్వ రాఘవన్. ఐతే ఈ స్టేట్మెంట్ చూసి ఇంతగా అంటే ఎంతగా అని ప్రశ్నిస్తున్నారు ప్రేక్షకులు. అలాగే ఈ చిత్రంలో ప్రథమార్ధం వరకు సూర్య హీరో అని, ద్వితీయార్ధంలో విలన్ అని సెల్వ రాఘవన్ పేర్కొనగా.. ‘నువ్వు మాత్రం ఫుల్ సినిమాకు విలన్’ అని సెటైర్ వేస్తున్నారు.

సూర్యతో విభిన్నమైన పాత్ర చేయించినందుకు తనను అందరూ అభినందిస్తున్నారని, ప్రేక్షకులు సినిమా విషయంలో థ్రిల్ అవుతున్నారని సెల్వ రాఘవన్ అంటుంటే.. ఆ వ్యాఖ్యల మీదా సెటైర్లు పడుతున్నాయి. అతడి మీద ఇప్పటికే బోలెడన్ని కామెడీ మీమ్స్ తయారయ్యాయి. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు అందించిన సెల్వ నుంచి ఇలాంటి చెత్త సినిమా రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుంటే.. సినిమా సూపర్ హిట్ అంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో అతడి పరువు మరింతగా పోయింది

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English