రేణు రెండో పెళ్లి చేసుకోదా?

రేణు రెండో పెళ్లి చేసుకోదా?

పవన్ కళ్యాణ్ నుంచి ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ విడిపోయి చాలా ఏళ్లయింది. పవన్‌తో విడాకుల తర్వాత కొన్నేళ్ల పాటు ఎక్కడా కనిపించని రేణు.. రెండు మూడేళ్ల ముందు నుంచి మళ్లీ యాక్టివ్ కావడం, పవన్ మీద తన ప్రేమను చాటుకుంటూ రావడం తెలిసిందే. దీని వల్ల రేణుకు, పవన్‌ అభిమానులకు మధ్య కొంత ఇబ్బందికర వాతావరణం కూడా నెలకొంది.

ఐతే గత ఏడాది తాను పుణెలో అక్కడి వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన రేణు.. ఇక తెలుగు వాళ్లతో సంబంధాలు తెంచుకున్నట్లే కనిపించింది. కొన్ని నెలల పాటు రేణు మౌనంగా ఉండటంతో ఆమెను అంతా మరిచిపోయారు. కానీ కొన్ని నెలలుగా మళ్లీ రేణు యాక్టివ్ అవుతోంది. తెలుగువాళ్లతో టచ్‌లో ఉంటోంది. ఏడాది కిందటే నిశ్చితార్థం చేసుకున్న రేణు ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఆశ్చర్యకరం.

ఇదేమీ యుక్త వయసులో చేసుకునే తొలి పెళ్లి కాదు. నిశ్చితార్థం తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడానికి. ఈ వయసులో ఎంగేజ్మెంట్ తర్వాత ఇంత విరామం రావడం సందేహాలకు దారి తీసింది. రేణు ఎవ్వరికీ చెప్పకుండా సైలెంటుగా పెళ్లి చేసుకుందా.. లేక పెళ్లి క్యాన్సిల్ చేసుకుందా అన్నది అర్థం కాక అందరూ అయోమయంలో పడిపోయారు. ఐతే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో భాగంగా తనకింకా పెళ్లి కాలేదని, త్వరలో చేసుకుంటానని అంది. ఐతే తాజాగా రేణు తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన ఒక కవిత చూస్తుంటే మాత్రం.. రేణుకు ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని సందేహాలు కలుగుతున్నాయి.

‘‘ప్రేమను మళ్లీ నేర్చుకోవడం సాద్యమేనా?’’.. ‘‘మొదటి సారి ప్రేమలో పడ్డప్పుడు వచ్చిన నవ్వు ఇప్పుడు వస్తుందా?’’.. ‘‘ఒకసారి అద్దంలో మొహం చూసుకుంటే మీరు కోల్పోయింది ఏంటో మీకే అర్థం అవుతుంది’’.. ‘‘నిద్ర లేని రాత్రులు గడిపే వారికి వారి ప్రేమ గురించి తెలుస్తుంది’’ అంటూ వైరాగ్యం నిండిన మాటలతో ఈ కవితను నింపేసింది. ఇది చదివితే మాత్రం రేణు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఇందులో ఏ వాక్యం ఎవరినుద్దేశించి.. ఏ ఆలోచనతో రాసిందన్నది మనం చెప్పలేం కానీ.. మరో పెళ్లి చేసుకునే విషయంలో రేణు ఒక రకమైన సందిగ్ధావస్థలో ఉందేమో అన్న అనుమానం మాత్రం కలుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English