చంద్రబాబు దెబ్బకి గూబ గుయ్యిమంది!

చంద్రబాబు దెబ్బకి గూబ గుయ్యిమంది!

రాంగోపాల్‌వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'లో వాస్తవాలు మాత్రమే తీస్తున్నానని చెప్పి, పూర్తిగా వన్‌ సైడెడ్‌గా లక్ష్మీపార్వతిని సాధ్విలా చూపిస్తూ ప్రాపగాండా సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పట్ల వున్న ఆసక్తి కారణంగా తెలంగాణలో విడుదలైనపుడు కాస్త కలక్షన్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు విడుదల కానివ్వకుండా చేసారు. మధ్యలో రాంగోపాల్‌వర్మ ఆంధ్రాకి వెళ్లాలని ప్రయత్నించినా కానీ అడ్డుకున్నారు. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఆలస్యం చేయగలదో అంతా ఆలస్యం చేసింది.

ఎట్టకేలకు ఈ చిత్రం మే 31న ఏపీలో రిలీజ్‌ అయింది. ఈ చిత్రానికి అక్కడ నామ మాత్రపు స్పందన కూడా రావడం లేదని ట్రేడ్‌ చెబుతోంది. వేడి వేడిగా వున్నపుడు విడుదల చేసినట్టయితే ఏపీలో తక్కువలో తక్కువ ఆరు కోట్ల షేర్‌ అయినా వచ్చేదని, కానీ ఇంత ఆలస్యం కావడం వల్ల, ఈ చిత్రం పట్ల ఆసక్తి పూర్తిగా సన్నగిల్లడం వల్ల, ఆల్రెడీ చంద్రబాబునాయుడు ఎన్నికల్లో పరాజయం పాలయి వుండడం వల్ల ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ పూర్తిగా కరవైంది.

అసలే హిట్లు లేని వర్మకి ఈ చిత్రంతో మంచి విజయం సాధించి, లాభాలు వెనకేసుకునే అవకాశం దక్కింది. కానీ మరీ ఎన్నికల వేళ అజెండాతో విడుదల చేయాలని చూడడంతో బెడిసి కొట్టింది. చంద్రబాబు ఉక్కుపాదం మోపడంతో చేతికి రావాల్సిన డబ్బులు కూడా రాకుండా పోయాయి. ఇప్పుడు ట్వీట్లతో గిల్లుకుని సంబర పడడం తప్ప వర్మ చేయడానికంటూ ఏమి మిగిలింది?

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English