మరీ విర్రవీగకు దాసూ!

మరీ విర్రవీగకు దాసూ!

ట్రెయిలర్‌లో బూతులుంటే చాలు... 'అబ్బా ఏం మాట్లాడేసాడురా' అంటూ చొంగ కార్చేయడం నేటి యువతకి పట్టిన దరిద్రం. అదే దరిద్రాన్ని క్యాష్‌ చేసుకునేందుకు చాలా సినిమాలు పుట్టుకొస్తున్నాయి. మిగతావి ఎలా వున్నా బూతులు మాట్లాడేసి అదే 'మాస్‌' అనిపించుకోవాలని చూస్తున్నాయి. అలా తయారయిందే 'ఫలక్‌నుమా దాస్‌'. సినిమా అంతటిలో బూతు మాటలు విరివిగా వాడేసారని తప్ప మరింకేం చెప్పుకోతగ్గ ఉత్తమ లక్షణం లేదు. ఆ బూతుల్లో చాలా వరకు సెన్సార్‌ కత్తెరకి గురయినా కానీ ట్రెయిలర్‌లో అవేమిటో వినిపించేయడం వల్ల అవి ఆల్రెడీ పాపులర్‌ అయిపోయాయి. ఇకపోతే ఈ చిత్రానికి ఇదే కారణం మీద హైదరాబాద్‌ నగరంలో ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయి. దీంతో 'దెం..తే బాక్సాఫీస్‌ షేపవుట్‌ అయిపోతుంది' అంటూ తన ర్యాలీ ఫోటో పెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు విశ్వక్‌ సేన్‌.

కొన్ని లక్షల రూపాయల వసూళ్లకే బాక్సాఫీస్‌ షేపవుట్‌ అయిపోతే అరవై, డెబ్బయ్‌ కోట్లు వసూలు చేసిన విజయ్‌ దేవరకొండ లాంటి హీరోలు ఎలా మాట్లాడాలి? సినిమా విడుదల కాకముందు నుంచీ ప్రగల్భాలు పలుకుతోన్న ఫలక్‌నుమా దాస్‌ బూతులకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అవ్వాలని చూస్తున్నట్టున్నాడు. ఇలాంటోళ్లని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని మైకుల ముందు పచ్చి బూతులు మాట్లాడ్డానికి యువత జంకడం లేదు. ఈ చిత్రానికి సంబంధించిన పబ్లిక్‌ టాక్‌ వీడియోలు చూస్తే ఆ జాఢ్యం ఎంత ముదిరిందనేది తెలుసుకోవచ్చు. స్నేహితులతో ఎలాగైనా సంభాషించుకోవచ్చు కానీ సమాజంలో సభ్యత, సంస్కారం పాటించాలనే కనీస ఇంగితర నేర్వకపోవడం మన దౌర్భాగ్యం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English