దేవరకొండ దోమ కుట్టేసింది

దేవరకొండ దోమ కుట్టేసింది

పబ్లిక్‌ వేదికలపై ఫిల్టర్‌ లేకుండా ఇష్టానికి మాట్లాడేస్తే కుర్రాళ్లు ఫాన్స్‌ అయిపోతారని విజయ్‌ దేవరకొండ ఎగ్జాంపుల్‌ చూసి చాలా మంది కొత్త హీరోలు అతడినే కాపీ కొడుతున్నారు. అయితే దేవరకొండకి వచ్చిన రౌడీ ఇమేజ్‌ కేవలం అతను స్టేజీపై మాట్లాడిన మాటలతో వచ్చింది కాదు. అర్జున్‌రెడ్డి సినిమా అతడిని ప్రత్యేకమైన ఇమేజ్‌ తెచ్చిపెట్టగా, దానికి తన ఆఫ్‌ స్క్రీన్‌ స్టయిల్‌ని జోడించి మరి కాస్త పెంచుకున్నాడు. అయితే తమ ఖాతాలో అర్జున్‌రెడ్డి లేకపోయినా విజయ్‌ని అనుకరించేస్తే కుర్రాళ్లు ఫిదా అయిపోతారని కొత్త కుర్రాళ్లు అతడిని చూసి వాత పెట్టుకుంటున్నారు. ఫలక్‌నుమా దాస్‌ తొలి షో అయినా పడకముందే బ్లాక్‌బస్టర్‌ అని ఫీలయిపోయిన విశ్వక్‌ సేన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చాలా ఎక్కువ మాట్లాడేసాడు.

తీరా సినిమా బాక్సాఫీస్‌ వద్ద బాల్చీ తన్నేసింది. పైగా అంత ఓవరాక్షన్‌ చేసినందుకు తగిన శాస్తి జరిగిందంటూ అతడిని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తికేయ కూడా తనేదో సూపర్‌స్టార్‌ అయిపోయానన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎవరో ఒకరికి కలిసి వచ్చిన స్టయిల్‌ని మిగతా వాళ్లు అనుకరిస్తే వీళ్లు అతి చేస్తున్నారంటూ ఫెయిల్యూర్‌ కోరుకుంటారు. అదే ఎంత సక్సెస్‌ అయినా వినమ్రంగా వుంటే వాళ్ల విజయాన్ని కాంక్షిస్తారు. దేవరకొండ ట్రాప్‌లో పడిపోకుండా వీళ్లంతా కాస్త  జాగ్రత్త పాటిస్తే అనవసరమైన నెగెటివిటీని ఎట్రాక్ట్‌ చేయకుండా వుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English