సాయి పల్లవి ఓవరాక్షనే ముంచేసిందా?

సాయి పల్లవి ఓవరాక్షనే ముంచేసిందా?

అల్లాటప్పా కథలతో తన వద్దకు రాకండి అంటూ నిర్మాతలకి అల్టిమేటం ఇచ్చి, కేవలం తన పాత్ర అద్భుతంగా వుంటే తప్ప ఏ సినిమా అంగీకరించను అంటూ చాలానే కబుర్లు చెప్పిన సాయి పల్లవి తమిళంలో ఎంచుకుంటోన్న సినిమాలు, అందులో ఆమె పోషిస్తోన్న పాత్రలు చూస్తే చాలా ఓవరాక్షన్‌ చేసిందని అనిపించక మానదు. మారి 2, తాజాగా ఎన్‌జికెలో ఆమె అర్థం లేని పాత్రల్లో కనిపించి తనకున్న మంచి పేరుని బాగా చెడగొట్టుకుంది. ఈ రెండు చిత్రాలలో తన పాత్రల కంటే ఆయా హీరోలతో నటించడం మీదే సాయి పల్లవి ఆసక్తి చూపించిందని అర్థమైపోతుంది.

తమిళంలో హీరోలని చూసి సైన్‌ చేసేస్తోన్న సాయి పల్లవి తెలుగు చిత్రాలకి మాత్రం కథలు తీసుకురమ్మని డిమాండ్‌ చేయడం విడ్డూరమే మరి. ఏదేమైనా వరుస పరాజయాలతో పాటు నటిగా కూడా ప్రతి సినిమాతోను తన స్థాయి తగ్గించుకుంటోన్న సాయి పల్లవికి మళ్లీ ఫిదా లాంటి సినిమా ఏదైనా పడితే తప్ప మునుపటి క్రేజ్‌ వచ్చే అవకాశం లేదు. ఎంసిఏ చిత్రం రిలీజ్‌ అయ్యే నాటికి ఆమె కోసమే కుర్రాళ్లు క్యూలు కట్టేసారు. ఇప్పుడు ఎన్‌జికె చిత్రాన్ని కనీసం ఎవరూ పట్టించుకోవడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English