దూకుడు అంటున్నారు.. ఆగడు అవ్వదు కదా

దూకుడు అంటున్నారు.. ఆగడు అవ్వదు కదా

‘మహర్షి’ తర్వాత సుకుమార్‌తో జట్టు కట్టాల్సిన మహేష్ బాబు.. అనిల్ రావిపూడి సినిమాను లైన్లో పెట్టాడు. దీనికి అతను చెప్పిన కారణం.. వరుసగా సీరియస్ సినిమాలే చేస్తున్న తాను.. కొంచెం రూట్ మార్చి ఎంటర్టైనర్ చేయాలనుకున్నానని.. అందుకే అనిల్‌తో సినిమా చేస్తున్నానని అన్నాడు. అనిల్ మొదట్నుంచి ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు.

సంక్రాంతికి అతను ‘ఎఫ్-2’తో ఎలా ఎంటర్టైన్ చేశాడో తెలిసిందే. మహేష్-అనిల్ కాంబినేషన్లో రాబోయే చిత్రం ‘దూకుడు’ స్టయిల్లో ఉంటుందని అంటున్నారు. ‘దూకుడు’లో మహేష్ పోలీస్ పాత్ర చేస్తే ‘సరిలేరు నీకెవ్వరు’లో ఆర్మీ మేజర్‌గా కనిపిస్తున్నాడు. ‘దూకుడు’ సినిమాను నిర్మించిన అనిల్ సుంకర ‘సరిలేరు..’కు నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

ఐతే ‘దూకుడు’ అప్పట్లో ఇరగాడేసింది కానీ.. ఆ తర్వాత ఆ టైపు సినిమాలు చాలా వచ్చాయి. మళ్లీ అదే స్టయిల్లో శ్రీను వైట్ల మహేష్ బాబు‌తో ఎంటర్టైనర్ ట్రై చేస్తే ‘ఆగడు’ డెలివర్ అయింది. ఆ చిత్రానికి అనిల్ రచయితగా పని చేసిన సంగతి ప్రస్తావనార్హం. సీరియస్ కథతో చేసిన ‘1 నేనొక్కడినే’ డిజాస్టర్ అయిందని మహేష్ ‘ఆగడు’ లాంటి ఎంటర్టైనర్ చేస్తే ఫలితం ఎలా వచ్చిందో తెలిసిందే. అనిల్ వరుసగా హిట్లు కొట్టి ఉండొచ్చు కానీ.. స్టార్ హీరోలు రొటీన్ సినిమాలు చేస్తే జనాలు ఆదరించట్లేదు.

కాబట్టి మాస్ మాస్ అని రొటీన్ స్టయిల్లో చేయాలని చూస్తే ‘ఆగడు’ ఫలితం రిపీటయ్యే ప్రమాదం ఉంది. ‘ఎఫ్-2’కు టైమింగ్ కలిసొచ్చి అలా ఆడేసింది కానీ.. మామూలుగా చూస్తే అదంతా ఆడాల్సిన సినిమా కాదు. కాబట్టి ‘సరిలేరు నీకెవ్వరు’లో ఎంతో కొంత వైవిధ్యం చూపిస్తూ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించాల్సిందే. ఈ సినిమా స్క్రిప్టు మరీ హడావుడిగా రెడీ చేసిన అనిల్.. మేకింగ్ టైంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించకపోతే కష్టం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English