‘మహర్షి’ కలెక్షన్లు.. దిల్ రాజు లెక్క ఇదీ

‘మహర్షి’ కలెక్షన్లు.. దిల్ రాజు లెక్క ఇదీ

ఈ మధ్య కాలంలో ‘మహర్షి’ సినిమా కలెక్షన్ల మీద జరిగినంత రచ్చ మరే సినిమా విషయంలోనూ జరగలేదు. ఈ సినిమా కలెక్షన్లను పెంచి చూపించారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ సినిమాకు వచ్చిన టాక్‌తో పోలిస్తే చిత్ర బృందం ప్రకటించిన వసూళ్లు ఎక్కువగా కనిపించాయి. పోస్టర్ల మీద వేసిన ఫిగర్స్ కూడా అతిగా అనిపించాయి. ఇందులో పీఆర్వోల మాయాజాలం ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి.

అసలు ‘మహర్షి’ ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్ సాధించిందా లేదా అనే విషయంలోనూ సందేహాలున్నాయి. ఐతే ఈ సందేహాలకు నిర్మాత దిల్ రాజు స్వయంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. మహేష్ బాబుతో కొత్తగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను నిర్మిస్తున్న ఆయన.. ‘మహర్షి’ వసూళ్ల గురించి మాట్లాడారు.

‘మహర్షి’ వరల్డ్ వైడ్ రూ.100 కోట్ల షేర్ మార్కును దాటినట్లుగా రాజు వెల్లడించాడు. అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం వసూళ్ల మోత మోగించినట్లుగా చెప్పిన రాజు.. మహేష్ కెరీర్లో ఇదే హైయెస్ట్ గ్రాసర్ అన్నాడు. ముఖ్యంగా నైజాం ఏరియాలో ‘మహర్షి’ అద్భుతంగా పెర్ఫామ్ చేసిందని.. త్వరలోనే ఇక్కడ రూ.30 కోట్ల షేర్ మార్కును అందుకోబోతోందని చెప్పాడు రాజు. ఆయన చెబుతున్నది నిజమే అయితే.. ‘రంగస్థలం’ తర్వాత తెలుగులో ఇదే హైయెస్ట్ గ్రాసర్ కాబోతోందనుకోవాలి.

‘ఖైదీ నంబర్ 150’ రూ.105 కోట్ల షేర్‌తో అప్పట్లో నాన్-బాహుబలి రికార్డు నెలకొల్పింది. దాన్ని ‘రంగస్థలం’ దాటేసింది. రూ.128 కోట్ల షేర్‌తో కొత్త రికార్డు నెలకొల్పింది. అది ఇప్పుడిప్పుడే బద్దలయ్యేలా కనిపించడం లేదు. నిర్మాత లెక్కలే నిజమైతే.. ‘మహర్షి’ మహేష్‌కు తొలి రూ.100 కోట్ల షేర్ మూవీ అన్నమాట. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.175 కోట్ల గ్రాస్ మార్కును దాటినట్లుగా పోస్టర్ మీద వేశారు. ఆ ప్రకారం చూస్తే షేర్ రూ.120 కోట్ల దాకా ఉండాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English