యాజిటీజ్ దించేశాడుగా..

యాజిటీజ్ దించేశాడుగా..

ఒకప్పుడు తమిళం నుంచి ఒక సినిమా తెలుగులోకి రీమేక్ అయితే సూపర్ హిట్ అనే భరోసా ఉండేది. అప్పట్లో రీమేక్‌ల సక్సెస్ రేట్ చాలా బాగుండేది. విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున లాంటి వాళ్లు రీమేక్‌లతో తమ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లు కొట్టారు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు చాలా మారిపోయాయి.

ఇంటర్నెట్ విప్లవం కారణంగా హద్దులు చెరిగిపోయి.. జనాలు అన్ని భాషల సినిమాలూ ముందే చూసేస్తున్నారు. రీమేక్‌లకు అంతగా ఆదరణ దక్కట్లేదు. అయినా కూడా రీమేక్‌లు ఏమీ ఆగట్లేదు. తాజాగా తెలుగులో తెరకెక్కిన రీమేక్.. రాక్షసుడు. తమిళంలో గత ఏడాది సెన్సేషనల్ హిట్ అయిన ‘రాక్షసన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ నెల ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్లిన ఈ చిత్రం మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం.తాజాగా ‘రాక్షసుడు’ టీజర్ కూడా రిలీజైంది.

‘రాక్షసుడు’ ఇంత వేగంగా ఎలా పూర్తయిందో టీజర్ చూశాక అర్థమైంది. ఒరిజనల్‌ నుంచి ఏమాత్రం పక్కకు వెళ్లకుండా యాజిటీజ్ దించేశాడు దర్శకుడు రమేష్ వర్మ. ఫ్రేమ్ టు ఫ్రేమ్ తమిళంలో ఉన్నట్లే ఉన్నాయి. ఒరిజినల్లో ఉన్న కొందరు నటీనటుల్ని కూడా తెలుగు వెర్షన్ కోసం తీసుకున్నారు. ఐతే ఒరిజినల్‌లోని సోల్ మాత్రం మిస్సవకుండా చూసుకున్నాడు రమేష్ వర్మ.

బెల్లంకొండ శ్రీనివాస్ గత సినిమాలతో పోలిస్తే కొంచెం బెటర్ యాక్టింగే చేసినట్లున్నాడు. మంచి ఫిజిక్ ఉంది కాబట్టి పోలీస్ పాత్రకు అతను బాగానే సూటయ్యాడు. తమిళం విష్ణు విశాల్ ఈ పాత్రలో అదరగొట్టాడు. అక్కడ అమలా పాల్ చేసిన పాత్రను తెలుగులో అనుపమ పరమేశ్వరన్ చేస్తోంది. యుక్త వయసు అమ్మాయిల్ని పాశవికంగా హత్య చేసే ఒక సైకో కిల్లర్‌ను పట్టుకోవడానికి ఒక పోలీస్ ఏం చేశాడనే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. విలన్‌ను ఉద్దేశించే ఈ టైటిల్ పెట్టడం విశేషం. జులై 18న ‘రాక్షసుడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English