రాజ్ తరుణ్‌ కే వీళ్లందరూ తగులుతారేంటో

రాజ్ తరుణ్‌ కే వీళ్లందరూ తగులుతారేంటో

ఈ మధ్యకాలంలో కుర్ర హీరో రాజ్‌ తరుణ్‌ తో సినిమా తీసినోళ్లందరూ.. ఫ్లాపు సినిమాలు తీసి కష్టాల్లో ఉన్నోళ్ళో లేదంటే ఒక్క సినిమాతో కాస్త పేరు తెచ్చుకున్నా హిట్టు మాత్రం కొట్టని డైరక్టర్లే. వరుసపెట్టి ఇటువంటి డైరక్టర్లకే అవకాశం ఇస్తూపోతున్న మన కుర్ర హీరో ఈ మధ్యనే ఒక కొత్త దర్శకుడుతో దిల్ రాజు ప్రొడక్షన్లో ఇద్దరి లోకం ఒకటే సినిమా చేస్తూ కాస్త ఊరటనిచ్చాడు. అలా మనం ఆనందపడేలోపే మళ్ళీ ఒక షాకిస్తున్నాడు.

అప్పట్లో కళ్యాణ్‌ రామ్ తో అసాధ్యుడు, తరువాత గ్యాపిచ్చి మంచు మనోజ్ తో మిస్టర్ నోకియా, తరువాత సందీప్ కిషన్ తో రన్ అంటూ ఒక తమిళ రీమేక్ డైరక్టర్ చేసిన అనిల్ కన్నెగంటి అనే దర్శకుడు గుర్తున్నాడు. ఇప్పుడు మారుతి రాసిచ్చిన ఒక స్ర్కిప్టును ఇతని డైరక్షన్లో చేయనున్నాడట రాజ్ తరుణ్‌. అయితే వరుసగా ఫ్లాపులు తీసిన దర్శకుడు హిట్టు సినిమాలు తీయలేరు అని చెప్పలేం కాని, ఈ కాంబినేషన్ మాత్రం వింటే ఎక్సయిటింగ్ గా లేనేలేదు. ఇప్పటికే మారుతి రాసిచ్చిన స్ర్కిప్టులు ఎన్నో మార్కెట్లో మెగా ఫ్లాపులుగా మిగిలిపోయాయ్. అలాగే అనిల్ సినిమాలు కూడా ఆడిందే లేదు. ఈ తరుణంలో వాళ్ళతో సినిమా అంటే, రాజ్ తరుణ్‌ కే వీళ్లందరూ తగులుతారేంటో అని ఎవరైనా అనుకుంటారులే.

అయితే ఇప్పటివరకు వరుస ఫ్లాపులతో తన అభిమానులను చాలా నిరాశకు గురిచేసిన రాజ్ తరుణ్‌, మరి ఇప్పుడైనా వరుసగా రెండు మూడు హిట్లు తన ఖాతాలో వేసుకుంటే, తనో పెద్ద స్టార్ అయ్యే ఛాన్సుంటుంది. అవతల తనతోపాటు వచ్చిన హీరోలు, తరువాత వచ్చిన హీరోలు ఆల్రెడీ 20 కోట్ల క్లబ్బులోకి వెళ్ళిపోతుంటే, మనోడు మాత్రం వెనుకబడిపోయాడు. చూద్దాం ఏం చేస్తాడో మరి!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English