ఆ కుర్రాడు ప్యాచ్ వర్క్ స్పెషలిస్టా?

ఆ కుర్రాడు ప్యాచ్ వర్క్ స్పెషలిస్టా?

తీసిన సినిమాలు సగంలో ఆగిపోవడం కొత్తేం కాదు. ప్రతీ సంవత్సరం కనీసం ఓ 30 సినిమాలైనా కూడా ప్రసాద్ ల్యాబ్ హార్డ్ డిస్కుల్లో ఉండిపోతాయ్. వివిధ కారణాల వలన సినిమాల విషయంలో అలా జరుగుతుంటుంది. అందులో ముఖ్యంగా డైరక్టర్ అండ్ టీమ్ కు మధ్య వివాదాలు వచ్చి ఆగిపోయిన సినిమాలు చాలానే ఉంటాయ్. ఇప్పుడు అలాంటి సినిమాలను ఆదుకోవడంలో ఒక డైరక్టర్ స్పెషలిస్టు అన్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపస్తోంది.

తొలుత కొన్ని షార్టు ఫిలింస్ తీసి తరువాత 'ఆ!' సినిమాను తీశాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాకు ప్రాఫిట్టు ఎంతొచ్చిందో తెలియదు కాని, సీనియర్ హీరో రాజశేఖర్ తో తీస్తున్న కల్కి సినిమాతో ఇంప్రెస్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను తీయకముందే, మనోడు డైరక్టర్ నీలకంఠ సగంలో ఆపేసిన ప్రాజెక్టును పూర్తి చేశాడు. తమన్నా హీరోయిన్ గా రూపొంది క్వీన్ రీమేక్ 'దటీజ్ మహాలక్ష్మి' సినిమా బ్యాలెన్స్ వర్క్ అండ్ ప్యాచ్ వర్క్ అంతా ఇతగాడే తీశాడు. కాకపోతే పోస్టర్లలో పేరేసుకోలేదు. ఇకపోతే ఇప్పుడు 2 స్టేట్స్ రీమేక్ ను కూడా ఇతగాడితోనే పూర్తిచేయించాలని చూస్తున్నాడు రాజశేఖర్. ఒరిజినల్ డైరక్టర్ వెంకట్ రెడ్డి కోర్టుకు వెళ్ళడంతో పనవ్వలేదు కాని, లేదంటే ఈపాటికి ప్రశాంత్ ఆ సినిమాను కూడా పూర్తిచేసేవాడట.

కాని ఇలా సగం కట్టేసిన బిల్డింగులను పూర్తి చేసుకుంటూ పోతే మనోడు ప్యాచ్ వర్క్ స్పెషలిస్టుగా మిగిలిపోతాడు కాని, తన ఒరిజినల్ మార్కును క్రియేట్ చేసుకోవడం కష్టమే. అందుకే ప్రశాంత్ వర్మ తన సొంత సినిమాల మీద ఫోకస్ చేస్తేనే బెటర్ అంటున్నారు అతడి అభిమానులు. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English