నాన్న చెప్పిందేదీ వర్కవుట్ కాలేదు నానా

నాన్న చెప్పిందేదీ వర్కవుట్ కాలేదు నానా

మా నాన్న గారు చెయ్యద్దని చెప్పినా కూడా, అనవసరంగా ఈ సినిమాను చేశానని ఇప్పుడు ఫీలవుతున్నా అంటూ కొందరు సన్నిహితులతో 'సీత' సినిమా రిజల్ట్ గురించి చెప్పుకుని కామెంట్ చేశాడట హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఇకపోతే కాజల్ గ్లామర్ నుండి బోరింగ్ థీమ్ వరకు, బోల్డ్ డైలాగుల నుండి సోనూ సూద్ కండల వరకు, తేజ తీసిన సీతను ఎవ్వరూ కాపాడలేకపోయారులే.

అయితే ఇప్పుడు ఈ సినిమా కథ విని ఫ్లాపవుతుంది అని తండ్రి బెల్లంకొండ సురేష్‌ ముందే చెప్పాడంటూ మన కుర్ర హీరో కామెంట్ చేయడం మాత్రం కాస్త విడ్డూరంగానే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ కుర్ర హీరో చేసిన సినిమాలన్నీ కూడా ఓకే చేసింది వాళ్ల నాన్నగారే. కాని అరడజను సినిమాల్లో ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. బోయపాటి తీసిన జయజానకి నాయక ఒకటే కాస్త పర్లేదు కాని, ఆ సినిమా కూడా కాస్ట్ ఫెయిల్యూర్ కావడంతో ఫ్లాప్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. మరి నాన్న చెప్పింది ఒక్కటీ వర్కవుట్ అవనప్పుడు, ఒక్క సీత విషయంలోనే మనోడు కొత్తగా ఫీలవ్వడం ఎందుకో?

మంచి లుక్స్ అండ్ స్ర్కీన్ ప్రెజన్స్ ఉన్నా కూడా, బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గర స్ర్కిప్ట్ జడ్జిమెంట్ సరిగ్గా లేకపోవడంతో సినిమాలు బెడసికొడుతున్నాయ్. పాత తరహాలో మసాలా కథలను పక్కనెట్టి కొత్త తరహా కథలు చేస్తే ఖచ్చితంగా మనోడు హిట్టు కొట్టే ఛాన్సుంది. మరి తమిళ సినిమా రాట్చసన్ రీమేక్ అయిన 'రాక్షసుడు'తో తొలి హిట్టు కొడతాడేమో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English