బూతులు, గ్లామర్, స్టార్స్: మొత్తం పులిహోరే

బూతులు, గ్లామర్, స్టార్స్: మొత్తం పులిహోరే

తెలంగాణ స్లాంగులో బూతులు తిడితే ఎక్కుతుందా? హీరోయిన్ అందాలను విపరీతంగా ఆరబోస్తే నచ్చుతుందా? లేదంటే స్టార్ హీరో అండ్ స్టార్ హీరోయిన్స్ ఉంటే సినిమా ఆడుతుందా? ఈ శుక్రవారం టాలీవుడ్లో అందరికీ ఇటువంటి సందేహాలే వచ్చాయి. కాని రిజల్టు చూశాక మాత్రం అందరూ షాకైపోయారు. ఎందుకంటే అవేం అక్కడ పనిచేయలేదు.

ఒక ప్రక్కన ఎలక్షన్లు అయిపోయాయ్, మరో ప్రక్కన ధియేటర్లలో ఒక్క మహర్షి తప్పిస్తే అసలు సినిమాలే లేవు. ఇటువంటి తరుణంలో ఏదన్నా సినిమా మినిమం బాగుంటే చాలు, జనాలు టక్కున చూసేస్తారు. అందుకే ఈ శుక్రవారం విడుదలైన ఫలక్ నుమా దాస్, ఎన్.జి.కె, అభినేత్రి 2 సినిమాల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి సూపర్ హిట్ అవుతుందని అందరూ ఆశించారు. కాని కంటెంట్ బాగుంటే, పబ్లిసిటీలో ఎంత పదును ఉన్నా కూడా పనవదని ఈరోజు తెలిసిపోయింది. తెలంగాణ స్లాంగుతో, చాలా బూతులతో, మందు అండ్ మటన్ తో పూర్తిగా నింపబడిన సినిమా ఫలక్నుమా దాస్. కాని సినిమా మొత్తం సాగదీయడంతో ఎక్కడా వర్కవుట్ కాలేదు. మరో ప్రక్కన అభినేత్రి 2 చూసుకుంటే, తమన్నా ఆరబోసిన గ్లామర్ తప్పించి అందులో ఏమిలేదని బాక్సాఫీస్ టాక్. ఇక మిల్కీ బ్యూటి గ్లామర్ తో టిక్కెట్లు తెగే రోజులు ఎప్పుడోపోయాయ్.

కట్ చేస్తే మిగిలింది హీరో సూర్య ఎన్.జి.కె మాత్రమే. సినిమాలో సూర్యతో పాటు సాయి పల్లవి అండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఉండటం ఒక స్టార్ ఎట్రాక్షన్ అయితే, సినిమాను సెల్వరాఘవన్ డైరక్ట్ చేయడం మరో ఎత్తు. అయినా కూడా సినిమాలోని కంటెంట్ బాగా బోరింగ్ గా ఉండడంతో అస్సలు ఏమాత్రం మూవీ జనాలకు ఎక్కలేదు. దానితో ఈ శుక్రవారం వచ్చిన సినిమాలన్నీ పాచిపోయిన పులిహోరలా ఉన్నాయనుకుని వచ్చే శుక్రవారం కోసం వెయిట్ చేయాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English