మోడీ బ్లాక్ బస్టర్.. సినిమా డిజాస్టర్

మోడీ బ్లాక్ బస్టర్.. సినిమా డిజాస్టర్

పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఎంతటి భారీ విజయం సాధించాడో తెలిసిందే. ఆయన నేతృత్వంలోని ఎన్డీయే 2014 ఎన్నికలకు మించి అద్భుత ఫలితాలు రాబట్టింది. ఇది అసాధారణ విజయమే. ఐతే మోడీ అంత పెద్ద విజయాన్నందుకున్నాడు కానీ.. ఆయన మీద తీసిన సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. మోడీ జీవిత కథ ఆధారంగా ‘పీఎం నరేంద్ర మోడీ’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్నికల కంటే ముందే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎన్నికల సంఘం, కోర్టు అభ్యంతరాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు గత వారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే మోడీ కోసం పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓట్లు గుద్దుతాం కానీ.. ఆయన సినిమా చూడటానికి థియేటర్లకు మాత్రం వెళ్లమని ప్రేక్షకులు స్పష్టంగా చెప్పేశారు.

తొలి వారంలో ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.16 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. వివేక్ ఒబెరాయ్ లాంటి పేరున్న హీరో, ఒమంగ్ కుమార్ లాంటి మంచి దర్శకుడు కలిసి చేసిన సినిమా.. పైగా మోడీ మీద తీశారు. దీనికి ఈ వసూళ్లు అంటే చాలా తక్కువే. ఈ చిత్రానికి విమర్శకులందరూ చాలా తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. చెత్త సినిమాగా పేర్కొన్నారు. అసలు దీని ట్రైలరే చాలా పేలవంగా అనిపించింది. ఈ సినిమా మొదలైనపుడే దీని ఉద్దేశమేంటన్నది అందరికీ అర్థమైపోయింది. ట్రైలర్ చూశాక కేవలం మోడీ భజన చేయడానికి.. భారత దేశ రాజకీయ చరిత్రలోనే ఆయనంత గొప్ప నాయకుడు మరొకరు లేదు అని చాటడానికి ఈ సినిమా తీసినట్లుగా అనిపించింది. సినిమా చూసిన వాళ్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతా ఎగ్జాజరేషన్ లాగా కనిపించడంతో మోడీ అభిమానులు సైతం ఈ సినిమా చూడటానికి ఇష్టపడినట్లు లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English