ఫిలింనగర్‌లో దొరికిపోతారా?

ఫిలింనగర్‌లో దొరికిపోతారా?

ఈసారి ఐపీఎల్‌ సీజన్‌ ముగిసినా... వివాదాలింకా నలుగుతూనే ఉన్నాయి. కోట్లాది రూపాయల బెట్టింగ్‌ పుణ్యమా అని ప్రముఖులెందరో జైలు ఊచలు లెక్కిస్తున్నారిప్పుడు. అయితే ఇదే బెట్టింగ్‌ అంశం తెలుగు సినీ పరిశ్రమను కూడా ఒక్క కుదుపు కుదిపేసింది. టాలీవుడ్‌కి చెందిన ఒక నిర్మాత అశ్విన్‌ అనే మారు పేరుతో భారీగా బెట్టింగులు నిర్వహించాడని, అతడెవరో తెలిస్తే మొత్తం సినీపరిశ్రమలో ఉన్న మిగతా బెట్టింగ్‌ బాబులు కూడా అడ్డంగా దొరికిపోతారని వార్తలొస్తున్నాయి.

అయితే ఇదే విషయంపై విలేకరులు అడిగిన పప్రశ్నలకు సమాధానంగా ఫిలింఛాంబర్‌ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ ఓ వివరణ ఇచ్చారు. ఫిలింఇండస్ట్రీకి ఎందరో నిర్మాతలు వస్తూ, పోతుంటారు. వారిలో ఎవరు? ఏమిటో?..చూడగానే చెప్పేయలేం. వారికి సంబంధించిన అన్ని వివరాలు మా వద్ద ఉండవు. అసలు అశ్విన్‌ అనే పేరుతో ఏ నిర్మాతా లేరు...అన్నారు. ఇకముందు సీరియస్‌గా ఇలాంటి విషయాలపై ముందస్తు జాగ్రత్త పాటిస్తామన్నారు. ఏది ఏమైనా అసలు అశ్విన్‌ అనే నిర్మాత ఉంటే..అతడేగనుక దొరికితే తీగ లాగితే డొంక కదిలిన చందంగా మొత్తం సినీపరిశ్రమ లోగుట్టు దొరికిపోవడం ఖాయం. ఇదే విషయంపై పరిశ్రమలో వాడి వేడి చర్చ సాగుతోందిప్పుడు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు