అక్క ఇరుక్కుంది.. చెల్లెలు క్లిక్కయ్యేలా ఉంది

అక్క ఇరుక్కుంది.. చెల్లెలు క్లిక్కయ్యేలా ఉంది

రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మికలను పక్క పక్కన పెట్టి చూస్తే లుక్స్ పరంగా పెద్దమ్మాయి శివానినే మెరుగ్గా కనిపిస్తుంది. చిన్నమ్మాయి శివాత్మిక యావరేజ్‌ అనిపిస్తుంది. వీళ్లిద్దరూ తమ తండ్రి సినిమాలకు సంబంధించిన వేడుకల్లో కనిపించినపుడు శివానినే ఎక్కువ హైలైట్ అయింది. శివాత్మిక సినిమాలకు పనికొస్తుందా అన్న సందేహాలు కూడా కలిగాయి.

‘2 స్టేట్స్’ లాంటి క్రేజీ బాలీవుడ్ మూవీ రీమేక్‌లో అడివి శేష్ లాంటి ఫాంలో ఉన్న హీరో పక్కన కథానాయికగా పరిచయం అయ్యే అవకాశం అందుకున్న శివానికి శకునాలు బాగానే కనిపించాయి కూడా. మరోవైపు శివాత్మికను అరంగేట్రం చేయించే విషయంలో చాలా తర్జనభర్జనలు నడిచాయి.

కానీ ఏడాది తిరిగేసరికి చూస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. శివాని కెరీర్ అయోమయంలో పడిపోయింది. ఆమె తొలి సినిమాకు మధ్యలోనే బ్రేక్ పడింది. ‘2 స్టేట్స్’ రీమేక్ ముందుకు కదలట్లేదు. తనను ఈ సినిమా నుంచి తప్పించాలని చూడటంపై దర్శకుడు వెంకట్ రెడ్డి న్యాయపోరాటానికి దిగడం సినిమా భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టింది. అతడితో సినిమా పూర్తి చేయించడానికి చిత్ర బృందం సుముఖంగా లేదు. మరోవైపు శివాత్మిక సైలెంటుగా తన తొలి సినిమాను పూర్తి చేసేస్తోంది.

ఆమె కథానాయికగా ‘దొరసాని’ అనే చిత్రం తెరకెక్కుతోంది. దీని ఫస్ట్ లుక్ తాజాగా లాంచ్ చేశారు. ఇందులో శివాత్మిక లుక్ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది.

ఇంతకుముందున్న లుక్‌కు భిన్నంగా తయారైందామె. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి క్రేజ్ కూడా బాగానే ఉంది. చూస్తుంటే అక్క కంటే చెల్లే కథానాయికగా క్లిక్ అయ్యేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English