అల్లు శిరీష్ హుందాగా ఒప్పేసుకున్నాడు

అల్లు శిరీష్ హుందాగా ఒప్పేసుకున్నాడు

అపజయాన్ని ఒప్పుకుంటే ఎవ్వరికైనా ఆ వ్యక్తి మీద గౌరవం పెరుగుతుంది. ఇంత చిన్న విషయం తెలిసి కూడా ఇగోకు వెళ్తుంటారు చాలామంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ ఒరవడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఫెయిల్యూర్ల గురించి మాట్లాడటానికి ఇక్కడి జనాలు అస్సలు ఇష్టపడరు. ఐతే మెగా ఫ్యామిలీ కుర్రాడు అల్లు శిరీష్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన కొత్త సినిమా ‘ఏబీసీడీ’ ప్లాప్ అని అతను ఒప్పేసుకున్నాడు. అది కూడా సినిమా రిలీజైన రెండు వారాలకే అతనీ మాట చెప్పడం విశేషం.

శుక్రవారం శిరీష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి పెద్ద ఎత్తున ట్విట్టర్లో సన్నిహితులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా శిరీష్ వాళ్లందరికీ ధన్యవాదాలు చెబుతూ ఒక మెసేజ్ పెట్టాడు. అందులో ‘ఏబీసీడీ’ ప్రస్తావన తెచ్చాడు.

‘ఏబీసీీడీ’ దర్శకుడు సంజీవ్, నిర్మాతలు, మిగతా టీం అంతా కలిసి ప్రేక్షకుల్ని అలరించే సినిమా అందించడానికి తమ శాయశక్తులా కష్టపడ్డామని.. కానీ తాము ఎంత కష్టపడ్డా ప్రేక్షకులు ఆశించిన సినిమా అందించలేకపోయామని శిరీష్ హుందాగా ఒప్పుకున్నాడు. తాము సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను పరిశీలించామని.. ప్రేక్షకుల తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నామని శిరీష్ చెప్పాడు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, యాష్ రంగినేనిలకు ధన్యవాదాలు చెప్పిన శిరీష్.. తన సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా థ్యాంక్స్ చెప్పాడు. భవిష్యత్తులో ప్రేక్షకులకు మెచ్చే సినిమాలు అందించే ప్రయత్నం చేస్తానంటూ అతను ముగించాడు. సినిమాతో కాకపోయినా ఈ మెసేజ్ ద్వారా శిరీష్ జనాల మనసులు గెలిచేశాడనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English