లోకల్ కుర్రాడా.. నాన్ లోకల్ స్టారా?

లోకల్ కుర్రాడా.. నాన్ లోకల్ స్టారా?

కొంచెం విరామం తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మళ్లీ కొంత వేడి పుట్టే పరిస్థితి కనిపిస్తోంది. ‘మహర్షి' తర్వాత రెండు వారాలు వెలవెలబోయిన బాక్సాఫీస్‌కు కొంచెం ఊపు తెచ్చేలా కనిపిస్తున్నాయి ఈ వారం సినిమాలు. ‘ఈ నగరానికి ఏమైంది' ఫేమ్ విశ్వక్సేన్ తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ‘ఫలక్‌నుమా దాస్'తో పాటుగా తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన డబ్బింగ్ మూవీ ‘ఎన్జీకే' ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తమన్నా-ప్రభుదేవా జంటగా నటించిన మరో డబ్బింగ్ మూవీ ‘అభినేత్రి-2' సైతం ఈ రోజు రిలీజవుతోంది. ఐతే ప్రధానంగా పోటీ ‘ఫలక్‌నుమా దాస్', ‘ఎన్జీకే' మధ్యనే అనడంలో సందేహం లేదు. ‘అభినేత్రి-2' నామమాత్రంగానే రిలీజవుతోంది.

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అంగామలై డైరీస్'కు రీమేక్‌గా తెరకెక్కిన ‘ఫలక్‌నుమా దాస్'కు విశ్వక్సేన్ హైదరాబాదీ ఫ్లేవర్ బాగానే తగిలించినట్లున్నాడు. దీని టీజర్, ట్రైలర్ భలే ఆసక్తికరంగా అనిపించాయి. ముఖ్యంగా అందులో బూతులు హైలైట్ అయ్యాయి. ఈ చిత్రానికి అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. ముందు రోజు పెయిడ్ ప్రివ్యూలు పెద్ద ఎత్తునే వేశారీ చిత్రానికి. శుక్రవారం బుకింగ్స్ కూడా బాగున్నాయి.

సినిమా హిట్ అవుతుందన్న అంచనాలున్నాయి. ఇక ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య.. గత కొన్నేళ్లలో వరుస ఫ్లాపులతో వెనుకబడ్డాడు. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఈ చిత్రంపై అంచనాలు తక్కువే ఉన్నాయి. కానీ సూర్య మాత్రం ఇది తనకు కమ్ బ్యాక్ ఫిలిం అవుతుందని ఆశిస్తున్నాడు. ‘ఎన్జీకే'కు బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. కానీ టాక్ బాగుంటే పుంజుకునే అవకాశాలున్నాయి. ఇక‘ ఫ్లాప్ మూవీ ‘అభినేత్రి'కి సీక్వెల్‌గా వస్తున్న ‘అభినేత్రి-2'ను తమన్నా అందాలే కాపాడాల్సి ఉంది. సినిమాపై ఏమాత్రం అంచనాలు లేవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English