సాహో టీమ్‌ స్వయంకృతాపరాధం

సాహో టీమ్‌ స్వయంకృతాపరాధం

సాహో చిత్రం నుంచి సంగీత దర్శకులు వైదొలగడంతో మిగిలిన పాటలు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం మిగలలేదు. శంకర్‌-ఎహ్‌సాన్‌-లాయ్‌కి తెలుగు చిత్రాలకి మ్యూజిక్‌ చేసిన అనుభవం లేదు. వారికి మన నేటివిటీ తెలియదు. ఈ సంగతి తెలిసినా కానీ బాలీవుడ్‌ మార్కెట్‌కి హెల్ప్‌ అవుతారని వారిని తీసుకున్నారు. వారు రెండు పాటలు చేసి ఇచ్చినపుడైనా ఇది వర్కవుట్‌ అవడం లేదని తెలుసుకుని ముందుగా మేలుకుని వుండాల్సింది. పుణ్యకాలమంతా వృధా చేసేసి, రెండేళ్లుగా నిర్మాణంలో వున్న సినిమాకి ఇంకా విడుదల రెండు నెలలే వుందనగా సంగీత దర్శకులతో సున్నం పెట్టుకున్నారు.

ఇంత భారీ సినిమాకి ఇప్పుడు మిగతా పాటలు త్వరగా ఇవ్వడం కానీ, నేపథ్య సంగీతం పూర్తి చేయడం కానీ వేరే వాళ్లకి అంత ఈజీ కాదు. మొదట్నుంచీ ఈ చిత్రంపై వర్క్‌ చేసిన వారితోనే పూర్తి చేయించి వుంటే పోయేదానికి వారిని వెళ్ళగొట్టేసారు. ఇది ఈ చిత్రానికి బ్యాడ్‌ పీఆర్‌ కూడా తెస్తోంది. ఆ ముగ్గురు సంగీత దర్శకులకి బాలీవుడ్‌ మీడియాలో మంచి పరిచయాలున్నాయి. అందుకే వారికి ఫుల్‌ కవరేజ్‌ దక్కుతోంది. సాహో బృందానికి ప్రొఫెషనలిజమ్‌ లేదనేది బాగా స్ప్రెడ్‌ అవుతోంది. ఒక క్రేజీ చిత్రానికి ప్రమోషన్లు మొదలైన దశలో రాకూడని బ్యాడ్‌ పబ్లిసిటీ దీనికి వస్తోందంటే అది ముమ్మాటికీ సాహో బృందం స్వయంకృతాపరాధమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English