చరణ్‌ మొహమాట పెట్టడంతో చిక్కుకుపోయాడు

చరణ్‌ మొహమాట పెట్టడంతో చిక్కుకుపోయాడు

చిరంజీవితో సినిమా చేద్దామని కొరటాల శివ వెళ్లిన సమయానికే అతని వద్ద కథ దాదాపు సిద్ధంగా వుంది. ఒక్కసారి చిరంజీవి నుంచి క్లియరెన్స్‌ లభించాక డిసెంబర్‌ నుంచి షూటింగ్‌ మొదలు పెడతానని కొరటాల శివ చెబితే చిరు, చరణ్‌ సరేనన్నారు. కానీ సైరా షూటింగ్‌ లేట్‌ అవుతూ రావడం వల్ల కొరటాల చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. జూన్‌లో ఎట్టి పరిస్థితుల్లోను మొదలు పెట్టేయాలని కొరటాల అడిగితే కొణిదెల హీరోలు తప్పకుండా చేసేద్దామన్నారు. కానీ సైరా తర్వాత కాస్త విరామం కావాలని చిరంజీవి కోరడంతో ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆగస్టుకి వెళ్లింది.

ఈ మధ్యలో ఒక సినిమా చేసేసుకునే అవకాశాన్ని కూడా కొరటాల మిస్‌ అయినట్టు అయింది. కానీ చరణ్‌తో వున్న సన్నిహిత సంబంధాల వల్ల కొరటాల శివ ఇంకా ఇంకా ఎదురు చూడాల్సి వస్తోంది. ఆగస్టులో షూటింగ్‌ మొదలు పెడితే ఆరు నెలలలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా కొణిదెల ప్రొడక్షన్స్‌ టీమ్‌ అయితే పక్కా ప్రణాళిక వేసిచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్లు ఎవరనే దానిపై మీడియాలో తరచుగా కథనాలు వస్తున్నాయి కానీ ఒక్కసారి షూటింగ్‌ షెడ్యూల్స్‌ ఫైనలైజ్‌ అయిన తర్వాత అందుకు తగ్గట్టుగా అందుబాటులో ఎవరు వుంటే వారికి అవకాశమిస్తారని తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English