సమంత-చైతన్య అంత ఈజీగా పడరు

సమంత-చైతన్య అంత ఈజీగా పడరు

ఏదైనా ఒక కాంబినేషన్‌ కానీ, కథాంశం కానీ జనాలకి నచ్చుతోందంటే ఇక దాని చుట్టే పరిభ్రమించడం సినీ పరిశ్రమకి అలవాటు. సక్సెస్‌కి షార్ట్‌కట్స్‌ వుండవని అంటారు కానీ ఇలాంటివి దొరికినపుడు మాత్రం అస్సలు వదులుకోరు. ఇంతకీ విషయం ఏమిటంటే... సమంత, నాగచైతన్య జంటకి బాక్సాఫీస్‌ వద్ద మంచి గిరాకీ వుంది. వీరిద్దరూ పెళ్లి కాకముందు నుంచీ పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఆటోనగర్‌ సూర్య తప్ప వీరు కలిసి చేసిన సినిమాలన్నీ హిట్లే. ఇటీవలే రిలీజ్‌ అయి సూపర్‌హిట్‌ అయిన మజిలీ కూడా ఈ కాంబినేషన్‌ వల్లే ఎక్స్‌ట్రా మైలేజీ దక్కించుకుంది.

దీంతో వీరిద్దరితో సినిమాలు తీయాలని పలువురు నిర్మాతలు, దర్శకులు అక్కినేని జంటని కాంటాక్ట్‌ చేస్తున్నట్టు తెలిసింది. అయితే సమంత మాత్రం ఈ విషయంలో చాలా నిక్చచ్చిగా వుందట. ఇంతవరకు తాము నటించిన సినిమాలు ఘన విజయాలు అందుకున్నాయంటే వాటి కథాంశాలు కూడా చాలా గొప్పగా, ప్రత్యేకంగా వున్నాయని, కేవలం తామిద్దరం నటించడం వల్ల జనం వాటిని చూడలేదని చెప్పిందట. కాబట్టి తమతో సినిమా తీయాలనుకుంటే అలాంటి గొప్ప కథ ఏదైనా వుంటేనే రండని, లేదంటే మామూలు కథలతో వచ్చి తమ సమయాన్ని వృధా చేయవద్దని తేల్చేసిందట. ఒక కాంబినేషన్‌కి సేలబులిటీ వున్నపుడు దానిని వీలయినంత పొడిగించుకుని, అవసరం పడినపుడల్లా బ్రహ్మాస్త్రంలా వాడడం మేలని ఈ జంట గ్రహించడం గొప్ప విషయమేనండోయ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English