పరువు పోతోంది.. ప్రూవ్ చేయాలి

పరువు పోతోంది.. ప్రూవ్ చేయాలి

కెరీర్ మొదలైనప్పటి నుంచి ఒక దశాబ్దంన్నర పాటు తన సంగీతం విషయంలో ఎవ్వరూ వేలెత్తి చూపే అవకాశం ఇవ్వలేదు దేవిశ్రీ ప్రసాద్. అతను ఆడియో ఇచ్చాడంటే ఒక్క పాటైనా స్పెషల్‌గా ఉండేది. ఒకవేళ పాటల్లో ఊపు కొంచెం తగ్గినా బ్యాగ్రౌండ్ స్కోర్‌తో కవర్ చేసేశాడు. కొన్ని ఆడియోల్లో ఆరుకు ఆరు పాటలతో అదరగొట్టిన సందర్భాలు బోలెడు. ఒక రెండు మూడేళ్ల ముందు వరకు సోషల్ మీడియాలో సైతం దేవిశ్రీని ఎవ్వరూ విమర్శించే సాహసం చేసేవాళ్లు కాదు. కానీ ఈ మధ్య పరిస్థితి మారిపోయింది. కెరీర్లో ఎన్నడూ లేని స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడతనను. సోషల్ మీడియా ట్రోలింగ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల అభిమానులు దేవిశ్రీని సంగీత దర్శకుడిగా పెట్టుకోండంటూ డిమాండ్లు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి తలెత్తడం ఆశ్చర్యకరం.

మహేష్ బాబు కొత్త సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా ఖరారు చేయగా.. అతను వద్దే వద్దంటూ కొన్ని వారాలుగా అభిమానులు సోషల్ మీడియాలో ఒక ఉద్యమం నడుపుతుండటం విశేషం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ కొత్త సినిమా కన్ఫమ్ అయినపుడే దేవిశ్రీని కూడా ఖరారు చేసేశారు. ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి మహేష్ అభిమానులు ఆగట్లేదు. ‘భరత్ అనే నేను’కే ఓ మోస్తరుగా అనిపించింది దేవి మ్యూజిక్. ‘మహర్షి’ మరీ సాధారణమైన ఔట్ పుట్ ఇవ్వడంతో వారికి మండిపోయింది. మహేష్ ల్యాండ్ మార్క్ మూవీని తన మ్యూజిక్‌తో దేవి దెబ్బ తీశాడన్న ఫీలింగ్‌ బలంగా ఉంది మహేష్ అభిమానుల్లో. దీంతో అతను వద్దే వద్దని.. కావాలంటే తమన్‌ను పెట్టుకోమని డిమాండ్లు చేస్తున్నారు. దేవికి కెరీర్లో ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. దేవి స్థాయి మ్యూజిక్ డైరెక్టర్‌కు ఇంతకంటే పరువు తక్కువ మరొకటి ఉండదు. మహేష్ సినిమాకు దేవిని మార్చే ఉద్దేశాలేమీ అనిల్‌కు ఉన్నట్లు కనిపించడం లేదు. తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పడం దేవి ముందున్న కర్తవ్యం. ఈ సినిమాతో తనేంటో చాటి చెప్పకపోతే మాత్రం దేవి కెరీర్‌కు బ్రేకులు పడటం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English