జస్ట్ సినిమా స్టార్లే.. దేవుళ్ళు కాదండోయ్

జస్ట్ సినిమా స్టార్లే.. దేవుళ్ళు కాదండోయ్

అవును, వీళ్ళందరూ కేవలం సినిమాల్లో స్టార్లే. సినిమాలు చేసే స్టార్లే. కాని దేవుళ్లు మాత్రం కానే కాదు. ఈ విషయం నార్త్ ఆడియన్స్ కు కాస్త ముందుగానే తెలిసింది కాని, మన సౌత్ లో ఆ విషయం తెలియడానికి చాలా టైమ్ పట్టింది. అయితే ఇప్పుడు కనువిప్పు అయ్యింది ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, సదరు స్టార్లకు కూడాను.

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌, కమల్ హాసన్, పోటీ చేయని రజనీకాంత్.. అందరూ కూడా తెరమీద దేవుళ్లే కాని, పాలిటిక్స్ లో మాత్రం నథింగ్ అనిపించుకుంటున్నారు. దానికి కారణం, ఒకప్పుడు జనాల కొరకు ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా కూడా యంజీఆర్, ఎన్టీఆర్ వంటి స్టార్లు రాజకీయాల్లోకి రావడంతోనే గెలిచేశారు. సినిమా స్టార్లే ఎవ్రిథింగ్ అనే ఆలోచనతో అప్పట్లో ప్రజలుండేవారు. అందుకే వాళ్ళు కాస్త తేలికగా సిఎంలు అయిపోయారు. దానితో అందరూ అదే రూట్లో వెళ్ళడం మొదలుపెట్టారు.

కాని స్టార్లు మారకపోయినా కూడా, జనాలు మాత్రం చాలా మారారు. తమ మధ్యన తిరిగే వైఎస్ జగన్, తమ కోసం పోరాటలు చేసే కెసిఆర్ లు తమకు కావాలి కాని, సినిమా స్టార్లు కాదని ప్రూవ్ చేశారు. ఈ మధ్యనే ముగిసిన ఎలక్షన్లు స్టార్లకు చాలా పాఠాలే నేర్పాయి.  పవన్ కళ్యాణ్‌ ఫ్లాప్ సినిమాను కూడా చాలామంది చూసేసి, ఆ సినిమాలకు 60 నుండి 70 కోట్లు కలక్షన్ రావడానికి దోహదపడతారేమో కాని, అధికారం కట్టుబెట్టడానికి మాత్రం అస్సలు జనాలు ఇష్టపడరని ఇప్పుడు అర్దమైంది. సేమ్ ఈక్వేషన్ అటు కమల్ హాసన్ విషయంలో కూడా ఋజువైంది.

ఎందుకంటే ఇప్పుడు జనం తమకు ఒక రాజకీయ నాయకుడు అసలు ఏం మేలు చేస్తాడో తెలుసుకోగలుగుతున్నారు. సినిమా స్టార్ అని అవకాశం ఇచ్చాక, వారు తమకు కావల్సిన సర్వీస్ చేయకపోతే, ఆ ఓట్ వేస్టయినట్లే అనే భావనకు చాలామంది వచ్చేశారు. అందుకే సినిమా స్టార్లయినా కూడా, రాజకీయాల్లోకి వచ్చాక జనం మధ్యలోకి వెళ్ళి వాళ్లతో ఎస్సు అనిపించుకుంటేనే పీఠం దక్కేది. లేదంటే పాఠమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English