పవన్ తో సినిమానా? అంతలేదు సార్

పవన్ తో సినిమానా? అంతలేదు సార్

ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తిరిగి సినిమాల్లోకి వస్తారా? ఈ ప్రశ్నకు ఎవరికి తోచిన ఆన్సర్ వాళ్ళు చెప్పినా కూడా, ఇదేదో బెర్ముడా ట్రైయాంగిల్ కు సంబంధించిన బ్రహ్మరహస్యం టైపులో అసలైన సమాధానం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికే పవన్ దగ్గర మైత్రి మూవీస్, రామ్ తాళ్ళూరి వంటి నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్సులు ఉన్నాయి కాబట్టి, వాళ్లతో ఏదన్నా ఒక ప్రాజెక్టు చేస్తాడేమోనని అందరూ అనుకుంటున్నారు.

ఇకపోతే సడన్ గా తెరమీదకి పవన్ కళ్యాణ్‌ కు అమిత భక్తుడుని అని చెప్పుకునే బండ్ల గణేష్‌ పేరొచ్చింది. పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి ఇండస్ర్టీలో బాగా పాపులర్ అయిపోయి మరో రెండ పెద్ద సినిమాలను తీసిన బండ్ల బాబు, ఈ మధ్య రాజకీయాలంటూ చాలా కామెడీలే చేశాడు. అవన్నీ పూర్తయ్యాక మళ్లీ సినిమాల్లోకి ఫుల్ టైమ్ వచ్చేస్తున్నాడని టాక్ ఉంది కాబట్టి, ఈ సినిమా టాక్ కూడా నిజమే అనుకన్నారందరూ. కాని తాను ఎటువంటి సినిమా తీయడంలేదని, పవన్ కళ్యాణ్‌ అస్సలు ఎటువంటి డిస్కషన్లూ జరపలేదని మనోడు క్లారిటీ ఇచ్చాడు. సో అవన్నీ రూమర్లేననమాట.

మరో ప్రక్కన తన కోళ్ళ ఫామ్ బిజినెస్ తో హ్యాపీగా ఉన్న బండ్ల గణేష్‌.. కొన్ని తెలుగు సినిమాల్లో ఇప్పటికే చిన్న చిన్న పాత్రలో నటిస్తున్నాడని టాక్ ఉండగా.. మహేష్‌ బాబుతో అనిల్ రావిపూడి తీసే సినిమాలో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ లో కనపబడనున్నాడట. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English