#RRR ఆగినట్టు లేదు.. ఆపేసినట్లుంది

#RRR ఆగినట్టు లేదు.. ఆపేసినట్లుంది

బాహుబలి సినిమా తరువాత టాలీవుడ్లో ఆ రేంజు హైప్ క్రియేట్ చేయగలిగిన సినిమా అంటే #RRR అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలోని స్వాతంత్ర్య పోరాటం తాలూకు బ్యాక్ డ్రాప్ ఒకెత్తయితే, సినిమాలో ఒక స్టార్ మెగా హీరో అండ్ ఒక టాప్ నందమూరి హీరో జతకట్టడం మరో ఎత్తు. అందుకే రామ్ చరణ్‌ అండ్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో లెజండరీ డైరక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాకు ఆ రేంజు బజ్ వచ్చింది.

అయితే గత నెలలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన #RRR టీమ్.. రామ్ చరణ్‌ కు జిమ్ చేస్తుండగా గాయం కావడంతో పూణె నగరంలో ప్లాన్ చేసిన షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. తరువాత ఎన్టీఆర్ తో హైదరాబాదులో కొన్ని సీన్లు లాగిస్తారు అనుకుంటే, మనోడు కూడా మణికట్టుకు గాయం కావడంతో షూటింగ్ కు బ్రేకిచ్చాడు. అయితే వీళ్ళు ఎప్పుడు రికవర్ అవుతారో తెలియదు కాని, ఆ మధ్యన దుబాయ్ లో ఫ్యామిలీతో ఎన్టీఆర్ ఇప్పుడు ఆఫ్రికాలో ఉపాసనతో రామ్ చరణ్‌ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి హాలిడేయింగ్ చూస్తే మాత్రం, #RRR ఆగినట్టు కాకుండా.. సమ్మర్ హాలిడేస్ కోసం సినిమాను ఆపేసినట్లుంది.

ఇకపోతే సినిమాలో చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ నటిస్తుంటే, ఎన్టీఆర్ పాత్రతో రొమాన్స్ చేసే ఫారిన్ అమ్మాయి మాత్రం ఇంకా దొరకలేదు. డైసీ ఎడ్గార్ జోన్స్ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ప్రస్తుతం రాజమౌళి మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడు. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English