ఈమె గారి అతి మామూలుగా లేదుగా

ఈమె గారి అతి మామూలుగా లేదుగా

బాలీవుడ్లో ఇప్పుడు కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలికి మించిన సంఘ సంస్కర్తలు లేరు. కాలం కలిసొచ్చి రెండు మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సక్సెస్ కావడం, నటిగా కంగనాకు మంచి పేరు రావడం, మార్కెట్ సంపాదించుకోవడం జరిగాయి. దీంతో ఇక కంగనా మామూలుగా రెచ్చిపోవట్లేదు. మొత్తం బాలీవుడ్‌ను ప్రక్షాళన చేసే బాధ్యత ఆమె, తన సోదరి రంగోలీలే తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

సంబంధం లేని సినిమాలు, విషయాల్లో కావాలని జోక్యం చేసుకుని వీళ్లిద్దరూ చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. కనీసం కంగనా ఏమైనా మాట్లాడినా ఒక అర్థం ఉంది. ఆమె ఎంతో సాధించింది కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు. కానీ ఆమె సోదరి చేస్తున్న ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. కంగనా తరఫున వకాల్తా పుచ్చుకుని ఎవరిని పడితే వాళ్లను ఎలా పడితే అలా విమర్శించేస్తున్న రంగోలి.. తాజాగా కయారా అద్వానీని టార్గెట్ చేసింది.

ప్రస్తుతం కియారా ‘ఇందూ కీ జవానీ’ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో కియారా డేటింగ్‌ యాప్స్‌లో కనిపించే అబ్బాయిల ప్రొఫైల్స్‌ చూసి నచ్చినవారిని ఎంపికచేసుకుని డేటింగ్‌ చేయాలనుకునే పాత్రలో కియారా నటిస్తోంది. ఈ సినిమా కథాంశం గురించి కియారా ట్విటర్‌లో ప్రకటించగానే రంగోలీ రంగంలోకి దిగిపోయింది.

‘‘ఎవరైనా సినిమాకు ‘ఇందూ కీ జవానీ’ అని టైటిల్‌ పెట్టి సినిమా తీస్తారా? ఓ పక్క మహిళా సాధికారత గురించి మాట్లాడుతూనే మరోపక్క వారిని ఆట బొమ్మలుగా చూపిస్తున్నారు. ఒకవేళ సెన్సార్‌ బోర్డు ఈ సినిమాను అంగీకరిస్తే అది ఆడవారికే అవమానకరం. మన భావితరాలు తలదించుకునే రోజులు వస్తాయి. ఇలాంటి సినిమాలు తీయడానికి బాలీవుడ్‌కు సిగ్గులేదూ? ఈ రకమైన సినిమాలు తీసే దర్శక, నిర్మాతలు తమ కుమార్తెల కళ్లల్లోకి చూడగలరా? సిగ్గుచేటు’’ అంటూ రంగోలి రెచ్చిపోయింది.

ఐతే కంగనా కూడా తనకు ఛాయిస్‌లు లేనపుడు, డబ్బు కోసం పనికి మాలిన క్యారెక్టర్లే చేసింది. ఆ తర్వాతేదో కలిసొచ్చి మంచి సినిమాలు పడుతున్నాయి. అంతమాత్రాన వేరే వాళ్లు చేసే సినిమాలపై ఆమె సోదరి కామెంట్లు చేయడం విడ్డూరంగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English