అబ్బే... ఆ హీరోకి అంత సీన్లేదు గురూ!

అబ్బే... ఆ హీరోకి అంత సీన్లేదు గురూ!

అదే పనిగా ఫ్లాపులిస్తూ పోతే ఏ హీరోకి అయినా మార్కెట్‌ ఢమాల్‌ అంటుంది. ఒక టైమ్‌లో రజని, కమల్‌ తర్వాత తమిళ హీరోలలో తెలుగునాట మంచి మార్కెట్‌ సాధించుకున్న సూర్య తనపై ప్రేక్షకులకి వుండే అంచనాలకి తగ్గ సినిమాలు చేయకపోవడంతో మార్కెట్‌ మొత్తం పోయింది. ఒకానొక సమయంలో అతని సినిమాలు ఇక్కడ ఇరవై కోట్లు బిజినెస్‌ చేసేవి. కానీ ఇప్పుడు అయిదు కోట్ల బిజినెస్‌ జరగడం గగనమైపోయింది. మిగతా సినిమాల మాట ఎలా వున్నా 'ఎన్‌జికె' చిత్రానికి తెలుగునాట గిరాకీ వుంటుందని సూర్య భావించాడు.

దర్శకుడు సెల్వ రాఘవన్‌కి ఇక్కడ మంచి పేరు వుండడంతో పాటు కథానాయికలు సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌ ఇద్దరూ ఇక్కడ పాపులర్‌ కనుక ఎన్‌జికెకి క్రేజ్‌ వస్తుందని ఆశించాడు. కానీ ఈ చిత్రానికి జరుగుతోన్న బుకింగ్స్‌తో దీని పట్ల ప్రీ రిలీజ్‌ క్రేజ్‌ అయితే లేదని తేలిపోయింది. ఇక సినిమా విడుదలయ్యాక వచ్చే టాక్‌పై ఆధారపడాల్సిందే. మాస్‌ జనాలు కరెంట్‌ బుకింగ్‌కే ప్రాధాన్యత ఇస్తారు కనుక మొదటి రోజు ఉదయం ఆటకి వారి నుంచి స్పందన వస్తుందని సూర్య ఆశిస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రానికి వస్తోన్న స్పందనతో సూర్య సీన్‌ బాగా పడిపోయిందనేది మాత్రం క్లియర్‌ అయిపోయిందని ట్రేడ్‌ వాళ్లు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English