సహనం కోల్పోతున్న రాజమౌళి

సహనం కోల్పోతున్న రాజమౌళి

పక్కా ప్రణాళికతో హాలీవుడ్‌ తరహాలో ఎంత భారీ చిత్రాన్ని అయినా సకాలంలో పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తాడు. బాహుబలి స్థాయి సినిమాలని కూడా అతను అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగాడు. కానీ తన తాజా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ మాత్రం రాజమౌళిని అసహనానికి గురి చేస్తోంది. ఇంతవరకు పట్టుమని నెల రోజులు సరిగ్గా షూటింగ్‌ చేసింది లేదు. ఒకవైపు స్టార్‌ కాస్ట్‌తో ఇబ్బంది ఎదురవుతూ వుంటే, మరో వైపు హీరోలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు గాయపడి షూటింగ్‌కి మరింత అంతరాయం ఏర్పడింది. వచ్చే జనవరికి షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసి, వచ్చే ఏడాది జులై 30న సినిమా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్‌ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు జనవరికి షూటింగ్‌ పూర్తి కావడం కష్టమనే సంకేతాలు అందుతున్నాయి.

బాహుబలికి ముందుగా టాకీ దృశ్యాలు తీసిన తర్వాత పోరాట దృశ్యాలు తెరకెక్కించిన రాజమౌళి ఈసారి ముందుగా పోరాట దృశ్యాలపై ఫోకస్‌ పెట్టడం తప్పయింది. హీరోలు ఇద్దరికీ గాయాలు కావడంతో షూటింగ్‌ నిలిచిపోయింది. బాహుబలి చిత్రీకరణ సమయంలో ప్రభాస్‌, రానా కూడా గాయపడ్డారు కానీ అది షూటింగ్‌ చివరి దశలో జరిగింది. హీరోలు ఇద్దరూ మళ్లీ సెట్స్‌ మీదకి వచ్చే నాటికి మిగతా షెడ్యూల్స్‌ అన్నీ పక్కాగా ప్లాన్‌ చేయాలని రాజమౌళి తన కో డైరెక్టర్లకి, ప్రొడక్షన్‌ డిజైన్‌ టీమ్‌కి స్ట్రిక్ట్‌ ఆర్డర్లు వేసినట్టు తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English