ఎన్టీఆర్‌ పెద్ద మిస్టేక్‌... మళ్లీ చేయం!

ఎన్టీఆర్‌ పెద్ద మిస్టేక్‌... మళ్లీ చేయం!

ఎన్టీఆర్‌ బయోపిక్‌ సెట్స్‌ మీదకి వెళ్లకముందు అదో క్లాసిక్‌ అవుతుందని భావించారు. ముందుగా ఒకటే భాగంగా తీద్దామని అనుకున్న సినిమాని బిజినెస్‌ క్రేజ్‌ చూసి రెండు భాగాలుగా విడదీసారు. అక్కడే అతి పెద్ద తప్పు జరిగిపోయింది. ఎప్పుడయితే సగం సినిమా చూపిస్తున్నారని తెలిసిందో చాలా మంది ఆసక్తి కోల్పోయారు. మొదటి భాగం విడుదలయిన తర్వాత సినిమా షూటింగ్స్‌ తప్ప ఏమీ లేవు అనే టాక్‌ ఎన్టీఆర్‌ చిత్రానికి పరాజయాన్ని కట్టబెట్టింది. ఇక రెండవ భాగం విడుదలయ్యే నాటికి సదరు చిత్రంపై వున్న ఆసక్తి పూర్తిగా సన్నగిల్లడంతో చరిత్రలోనే అతి పెద్ద పరాజయాల్లో ఒకటిగా మిగిలిపోయింది.

ఎన్టీఆర్‌ని రెండు భాగాలుగా విడుదల చేయడం తప్పని గ్రహించిన నిర్మాత విష్ణు ఇందూరి ఈసారి తాను తీయనున్న బయోపిక్‌ని మాత్రం రెండు భాగాలుగా చేసేది లేదని చెబుతున్నాడు. జయలలిత జీవిత కథతో కంగన రనౌత్‌ ప్రధాన పాత్రలో హిందీ, తమిళం, తెలుగు భాషలలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకుడు. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుందనే వార్తలని విష్ణు ఖండించాడు. ఎన్టీఆర్‌కి జరిగిన మిస్టేక్‌ ఈసారి రిపీట్‌ చేయబోమని, అయితే ఈ చిత్రాన్ని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. రాజకీయ నాయకులకి చెందిన బయోపిక్స్‌ జనాన్ని ఆకర్షించడం లేదని ట్రెండ్‌ చెబుతోన్న నేపథ్యంలో జయలలిత బయోపిక్‌కి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English