పృధ్వీకి మెగా ఫ్యామిలీ అంటే ఎందుకంత పగ?

పృధ్వీకి మెగా ఫ్యామిలీ అంటే ఎందుకంత పగ?

కమెడియన్‌ పృధ్వీ ప్రస్తుతం వైసిపి జెండా భుజాన వేసుకుని తిరుగుతున్నాడు. తన పార్టీకి ప్రచారం చేయడమే కాకుండా అవతలి వారిపై విమర్శలు కూడా గట్టిగానే చేస్తుంటాడు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అనగానే పృధ్వీ ఒంటి కాలిపై లేస్తూ వుంటాడు. మొన్నటి వరకు అతను పవన్‌కళ్యాణ్‌ని ఎంతగా టార్గెట్‌ చేసాడో తెలిసిందే.

జగన్‌ గెలిచిన తర్వాత కూడా చిరంజీవి అభినందించలేదంటూ మెగాపై తన పగ చాటుకున్నాడు. పృధ్వీకి మెగా ఫ్యామిలీ పట్ల ఎందుకంత కోపం? ఎందుకని కావాలని వారిని టార్గెట్‌ చేస్తున్నాడు? ఖైదీ నంబర్‌ 150లో పృధ్వీకి పెద్ద క్యారెక్టరే ఇచ్చారట. కానీ ఎడిటింగ్‌లో ఆ సీన్లు అన్నీ తీసేసారట. స్వయంగా చిరంజీవికి వెళ్లి చెప్పుకుంటే ఆయన రెండు సీన్లు పెట్టించారట.

ఒకటి సినిమాలో, మరొకటి రోలింగ్‌ టైటిల్స్‌ దగ్గర వుండడంతో అసలు పృధ్వీ పాత్ర పండలేదు. బాలకృష్ణ సినిమాల్లో, ఇతరుల సినిమాల్లో తనకి పెద్ద వేషాలు ఇచ్చినా కానీ చేసిన క్యారెక్టర్‌ని తొలగించేయడం పట్ల పృధ్వీ చాలా నిరాశ చెందాడు. అప్పటి పగని ఇలా తీర్చుకుంటున్నాడని ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English