సమంత మళ్లీ తేనెతుట్టెని కదిపింది

సమంత మళ్లీ తేనెతుట్టెని కదిపింది

వెండితెరపై ఇంకా తన మాయ కంటిన్యూ చేస్తూ భర్త విజయానికి కూడా కారణమయిన సమంత సోషల్‌ మీడియాలో మాత్రం తరచుగా అభిమానుల ఆగ్రహానికి గురవుతూ వుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా వుండే సామ్‌ తరచుగా తన ఫోటోలు పెడుతుంటుంది. అయితే పెళ్లయిన స్త్రీని, అక్కినేని వారి కోడలిని ఎలాగయితే జనం చూడాలని అనుకుంటూ వుంటారో సామ్‌ అందుకు విరుద్ధంగా కనిపిస్తుంటుంది. తను హాట్‌ ఫోటోలు పెట్టినపుడల్లా ఫాన్స్‌ గగ్గోలు పెడుతుంటారు. కానీ సామ్‌ మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు.

తాజాగా ఆమె ఒక ఫోటో అప్‌లోడ్‌ చేసింది. తన స్నేహితుడు డిజైన్‌ చేసిన ఫ్లోరల్‌ షర్ట్‌ని మార్కెట్‌ చేయడానికి ఆమె అది ధరించి హాట్‌గా ఫోజిచ్చింది. ఫేస్‌ కూడా చూపించకుండా 'షర్ట్‌' హైలైట్‌ అయ్యేలా ఫోటో పెట్టింది. అంతే... మోరల్‌ పోలీస్‌ ఆమెపై విరుచుకు పడుతున్నారు. కానీ సామ్‌ సంగతి తెలుసు కనుక ఆమె దీనికి బదులుగా మరింత హాటయిన ఫోటో రేపో మాపో పెడుతుందని ఆశించవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English