ఎన్టీఆర్‌ ప్లానింగ్‌ మొత్తం మటాష్‌!

ఎన్టీఆర్‌ ప్లానింగ్‌ మొత్తం మటాష్‌!

రాజమౌళి చిత్రంలో యంగ్‌ కొమరం భీమ్‌గా జూ|| ఎన్టీఆర్‌ కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసమని ఎన్టీఆర్‌ కండలు పెంచాడు. అరవింద సమేత చిత్రం కోసం తనతో సిక్స్‌ ప్యాక్‌ చేయించిన అంతర్జాతీయ ఫిజికల్‌ ట్రెయినర్‌ ఆధ్వర్యంలోనే ఎన్టీఆర్‌ తన అవతారం మార్చుకున్నాడు. మామూలుగా కంటే మజిల్‌ పెంచి ఒక విధమైన భారీకాయుడి ఆకారం సంతరించుకున్న ఎన్టీఆర్‌ ఆ మజిల్‌ మొత్తం కోల్పోయాడు. మణికట్టుకి గాయం కావడంతో ఎన్టీఆర్‌ విశ్రాంతి తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. దీని వల్ల కొన్ని వారాలుగా వ్యాయామం చేయలేకపోతున్నాడు.

వ్యాయామం లేకుండా ఆహారం తీసుకుంటే ఒళ్లు పెరుగుతుంది కనుక మితాహారం తీసుకుంటున్నాడు. దీని వల్ల ఎన్టీఆర్‌ మజిల్‌ కరిగిపోయింది. ఇంకా మణికట్టు గాయం నుంచి ఎన్టీఆర్‌ కోలుకోలేదని ఇవాళ ఎన్టీఆర్‌ ఘాట్‌ని సందర్శించిన సందర్భంలో తెలిసింది. ఇంకా చేతికి బ్యాండేజ్‌తోనే ఎన్టీఆర్‌ వున్నాడు. ఈ సందర్భంలోనే ఎన్టీఆర్‌ మజిల్‌ కోల్పోయాడనేది కూడా అభిమానులకి కనిపించింది. కష్టపడి సాధించిన బాడీ మళ్లీ తిరిగి సంతరించుకుంటే తప్ప షూటింగ్‌ చేయలేడేమో. ఆర్‌.ఆర్‌.ఆర్‌. షూటింగ్‌ మరికాస్త ఆలస్యమవుతుందేమో అనే భయం ఫాన్స్‌కి పట్టుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English