మహేష్‌ ఎట్టకేలకు మాట విన్నాడు

మహేష్‌ ఎట్టకేలకు మాట విన్నాడు

మహేష్‌ ఎక్కువగా సీరియస్‌ పాత్రలు చేస్తుంటాడు కానీ నిజానికి అతను ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధాన చిత్రాల్లో చెలరేగిపోతుంటాడు. పోకిరి, దూకుడు అతని కెరియర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్స్‌ అయ్యాయి. మధ్యలో శ్రీమంతుడుతో హిట్‌ రావడంతో మళ్లీ మహేష్‌ సీరియస్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. హీరోని సరదాగా చూపించడం కొరటాల శివకి ఇష్టం వుండదు. అది శ్రీమంతుడు, భరత్‌ అనే నేనులో రిపీట్‌ చేసాడు. ఆ హ్యాంగోవర్‌లో వుండి మహర్షి చిత్రంలోను సీరియస్‌గానే కనిపించాడు. కానీ తనని సరదా పాత్రల్లో చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడతారని విస్మరించాడు.

ఫ్లాప్‌ సినిమా ఖలేజాకి కూడా టీవీలో కల్ట్‌ ఫాలోయింగ్‌ వుందని గుర్తించలేదు. ఒక్క ఆగడు ఫ్లాప్‌ అయిందని మళ్లీ కమర్షియల్‌ సినిమా జోలికి పోలేదు. అయితే అభిమానుల కోరిక ఎట్టకేలకు విన్న మహేష్‌ తన తదుపరి చిత్రంలో పూర్తి స్థాయిలో సరదా పాత్రలో కనిపించబోతున్నాడు. అనిల్‌ రావిపూడి సినిమాల్లో కామెడీ శాతం ఎక్కువ కనుక ఈ చిత్రంలోను అది తగ్గకుండా చూసుకుంటున్నారు. మహేష్‌కి వున్న కామెడీ టైమింగ్‌కి అనుగుణంగా అతను ఇందులో క్యారెక్టర్‌ని తీర్చిదిద్దాడట. కాబట్టి మహేష్‌ని అలా చూడాలని కోరుకుంటోన్న వారి కోరిక త్వరలోనే తీరిపోనుందన్న మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English