రాజమౌళితో చెప్పించినా చరణ్‌కి పనవ్వలేదు

రాజమౌళితో చెప్పించినా చరణ్‌కి పనవ్వలేదు

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఒక హీరోగా నటిస్తోన్న చరణ్‌ తాను నిర్మిస్తోన్న సైరా చిత్రాన్ని హిందీలో కరణ్‌ జోహార్‌తో మార్కెటింగ్‌ చేయించాలని కోరుకున్నాడు. ఇందుకోసం రాజమౌళి సాయం కోరాడు. కరణ్‌తో సత్సంబంధాలున్న రాజమౌళి ఈ చిత్రాన్ని అతనికి సిఫార్సు చేసాడు. అయితే ఎందుకో కరణ్‌ జోహార్‌ ఈ చిత్రం పట్ల ఆసక్తి చూపించలేదు. కరణ్‌ పేరు తోడయితే దక్షిణాది చిత్రాలకి బాలీవుడ్‌లోను మంచి డిమాండ్‌ ఏర్పడుతోంది. బాహుబలి తర్వాత 2.0 కూడా నూట యాభై కోట్లకి పైగా నెట్‌ వసూళ్లని హిందీలో సాధించింది.

దీంతో హిందీ హక్కులకి పెద్దగా చెల్లించకపోయినా ధర్మా ప్రొడక్షన్స్‌ పేరు వుండాలని చరణ్‌ కోరుకున్నాడు. అయితే కరణ్‌ జోహార్‌ 'సైరా' పట్ల ఆసక్తి చూపించకపోవడంతో ఇక వేరే ఆప్షన్స్‌ చూసుకున్నారు. ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'సైరా'ని హిందీలో విడుదల చేయనుంది. కెజిఎఫ్‌ని మార్కెట్‌ చేసారు కనుక వీరిదీ మంచి హ్యాండే అనుకోవాలి కానీ కరణ్‌ జోహార్‌ తోడయితే ఆ లెక్కే వేరుగా వుండేది. స్నేహాలు, సాన్నిహిత్యాల కంటే కరణ్‌ బిజినెస్‌ పరంగానే ఆలోచిస్తూ వుంటాడు. రేపు రాజమౌళి సినిమాకి అయినా తనకి వర్కవుట్‌ అవుతుందని అనుకుంటేనే దిగుతాడు తప్ప బాహుబలి చేసాను కదా అనే మొహమాటంతో అతను తీసిన ప్రతి సినిమాని హిందీలో మార్కెట్‌ చేయడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English