వీళ్లకి తెలుగు సినిమా అంత లోకువా?

వీళ్లకి తెలుగు సినిమా అంత లోకువా?

'సైరా' చిత్రం ప్రకటించే సరికి సంగీత దర్శకుడిగా ఏ.ఆర్‌. రెహమాన్‌ పేరు ఖరారయింది. అయితే మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసే నాటికి రెహమాన్‌ వారికి కావాల్సిన అవుట్‌పుట్‌ ఇవ్వలేదు. దాంతో చేసేది లేక మోషన్‌ పోస్టర్‌ వీడియోకి తమన్‌తో మ్యూజిక్‌ చేయించుకున్నారు. అతను అదరగొట్టాడు కూడా. అయినప్పటికీ సంగీత దర్శకుడిగా రెహమాన్‌ పేరే వుంచారు. కానీ ఆనక తీరికగా ఈ చిత్రానికి సంగీతం ఇవ్వలేనంటూ అతను తప్పుకున్నాడు. అప్పుడు మరో హిందీ సంగీత దర్శకుడిని తెచ్చి పెట్టుకున్నారు. తాజాగా సాహో చిత్రానికి బాలీవుడ్‌ సంగీత త్రయం 'శంకర్‌-ఎహ్‌సాన్‌-లాయ్‌' హ్యాండిచ్చారు.

కారణం ఏమిటో చెప్పకుండా ఈ చిత్రం చేయడం లేదంటూ అభిమానులకి చిన్న మెసేజ్‌ పెట్టారు. తెర వెనుక పెద్ద గొడవే జరిగిందని కొత్తగా విడుదల చేసిన పోస్టర్‌లో వారి పేర్లు మిస్‌ అవడం బట్టే స్పష్టమయింది. దాదాపు రెండేళ్లుగా ఒక చిత్రంపై పని చేసి సింపుల్‌గా తప్పుకుంటున్నామని వారు అనేసారు. అదే పని బాలీవుడ్‌ స్టూడియోలయితే చేయగలరా? అయినా పర భాషా సంగీత దర్శకుల వెంట పడడం మానేసి లోకల్‌ టాలెంట్‌ మీదే మన వాళ్లు ఆధారపడితే బెటర్‌. బాహుబలి చిత్రాలకి సంగీతం అందించినది కీరవాణి కాదా? ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి కూడా అతనే సంగీతం అందించడం లేదా? ఈ అనుభవాలు దృష్టిలో వుంచుకుని అయినా తెలుగు సినిమాని లెక్క చేయని పరభాషా సంగీత దర్శకులని దూరంగా వుంచితే బాగుంటుందని జనాభిప్రాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English