మహర్షి చివరికి ఎక్కడ ఆగుతున్నాడు?

మహర్షి చివరికి ఎక్కడ ఆగుతున్నాడు?

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. హీరోగా అతడికిది 25వ సినిమా. దీని గురించి మహేష్‌తో పాటు దర్శక నిర్మాతలందరూ ఓ రేంజిలో చెబుతూ వచ్చారు. రిలీజ్ ముందే కాదు.. తర్వాత కూడా ప్రచారంతో హోరెత్తించేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి అయితే తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప సినిమా అన్న స్థాయిలో ‘మహర్షి’ గురించి చెప్పుకున్నాడు. మహేష్ ఒకటికి రెండుసార్లు కాలర్ ఎగరేశాడు. తీరా చూస్తే ఈ సినిమా ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్‌ సాధించేలా కనిపించడం లేదు.

ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తయింది. పోటీ లేకపోవడం వల్ల ఈ సినిమా ఇప్పటికీ చాలా థియేటర్లలో ఆడుతోంది. కానీ షేర్ నామమాత్రంగా వస్తోంది. రూ.100 కోట్ల షేర్ సాధిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ కాని ఈ చిత్రం రూ.94 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఇది గొప్ప విషయమే కానీ.. చివరికి నాలుగైదు కోట్లు డెఫిషిట్ తప్పేలా లేదు.

నైజాం, వైజాగ్ లాంటి ఏరియాల్లో బయ్యర్లకు లాభాలు తెచ్చి పెట్టిన ఈ చిత్రం చాలా ఏరియాల్లో బయ్యర్లకు నష్టాలే మిగులుస్తోంది. రాయలసీమలో రూ.12.5 కోట్లకు హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్‌ రూ.9 కోట్ల పైచిలుకు షేర్‌తో సరిపెట్టుకుంటున్నాడు. ఓవర్సీస్‌లో భారీ నష్టాలు తప్పట్లేదు. బ్రేక్ ఈవెన్ కావాలంటే 3.5 మిలియన్ల దాకా రాబట్టాల్సిన ‘మహర్షి’ ఫుల్ రన్లో 2.5 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువగా వచ్చింది. కనీసం మిలియన్ డాలర్లు తక్కువ పడుతున్నాయి.

దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేసుకున్న నైజాం ఏరియాలో ఈ చిత్రం అంచనాల్ని మించి పెర్ఫామ్ చేసింది. రూ.27 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఇక్కడ రూ.24 కోట్ల వాల్యూతో హక్కులు తీసుకున్నారు రాజు. వైజాగ్‌లో కూడా ఈ చిత్రం రూ.2 కోట్ల దాకా లాభాలు తెచ్చింది. మిగతా ఏరియాల్లో కొన్ని ప్రాంతాలు లాభాలు అందించగా, కొన్ని చోట్ల నష్టాలు తప్పలేదు. ఓవరాల్‌‌గా చూసుకుంటే ‘మహర్షి’ని ఎబోవ్ యావరేజ్ సినిమాగా చెప్పుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English