మహేష్ 26.. క్లారిటీ వచ్చేసింది

మహేష్ 26.. క్లారిటీ వచ్చేసింది

హీరోగా తన సిల్వర్ జూబ్లీ మూవీ ‘మహర్షి’తో ఓ మోస్తరు విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. కాకపోతే బాక్సాఫీస్ దగ్గర బాగానే పెర్ఫామ్ చేసింది. దీని తర్వాత మహేష్.. యువ దర్శకుడు అనిల్ రావిపూడితో పని చేయబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంక్రాంతికి ‘ఎఫ్-2’తో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్న అనిల్.. కొన్ని రోజుల్లోనే మహేష్ దగ్గర్నుంచి కమిట్మెంట్ తీసుకున్నాడు. ముందు లైన్ చెప్పి ఓకే చేయించుకున్న అనిల్.. తర్వాత స్క్రిప్టు మీద దృష్టిపెట్టాడు. మూడు నెలలుగా అతను తన టీంతో కలిసి అదే పని మీద ఉన్నాడు. ఆ పని పూర్తయ్యాకే సినిమాను పట్టాలెక్కిద్దామని చిత్ర బృందం ఎదురు చూస్తోంది. అందుకే ఇప్పటిదాకా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా రాలేదు.

ఐతే ఇటీవలే బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిందని.. విదేశీ పర్యటనకు వెళ్లకముందు మహేష్‌కు అనిల్ ఒక నరేషన్ కూడా ఇచ్చాడని సమాచారం. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా కుదురుతుందట. ఈ నెల 31న తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. రేపో ఎల్లుండో మహేష్ వెకేషన్ ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకోబోతున్నాడట.

శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిపించేసి.. ఎండలు కొంచెం తగ్గాక చిత్రీకరణ మొదలుపెట్టనున్నారట. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మంధాన ఖరారైనట్లు సమాచారం. దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నాడు. వరుసగా సీరియస్ సినిమాలు చేస్తూ వచ్చిన మహేష్.. ఇందులో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ చేయనున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English