సాహో రక్షకుడు ఎవరు?

సాహో రక్షకుడు ఎవరు?

‘సాహో’ సినిమా విడుదలకు రెండున్నర నెలలే సమయం ఉంది. ఇలాంటి సమయంలో సంగీత దర్శకులు శంకర్-ఎహసాన్-లాయ్ ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం షాకింగే. ఏడాదిన్నర ముందు మొదలైన ప్రాజెక్టు నుంచి విడుదల దగ్గర పడుతుండగా మ్యూజిక్ డైరెక్టర్లు తప్పుకోవడమేంటో అర్థం కావడం లేదు. దర్శకుడికి, మ్యూజిక్ డైరెక్టర్లకు సెట్ కాని పక్షంలో ఎప్పుడో నిర్ణయం తీసుకుని ఉండాలి. కానీ ఇంత పెద్ద సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న తరుణాన ఈ నిర్ణయం వెలువడటం అభిమానులకు షాకింగే.

ఇప్పటికి ‘సాహో’ టాకీ పార్ట్ మాత్రమే పూర్తయింది. ఇంకా పాటల చిత్రీకరణ మొదలే కాలేదు. ఇప్పటికిప్పుడు పాటలు ట్యూన్ చేసి ఆపై వాటిని చిత్రీకరించడం.. తర్వాత బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకోవడం అంటే చిన్న విషయం కాదు. దీని వల్ల క్వాలిటీ దెబ్బ తినేస్తుందేమో, సినిమా స్థాయికి తగ్గట్లు మ్యూజిక్ ఉండదేమో అన్న భయాలున్నాయి.

అసలు ఇంత వేగంగా క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చేదెవరన్నది ప్రశ్న. దానికి సమాధానంగా జిబ్రాన్ పేరు వినిపిస్తోంది. ‘వాగై సూడ వా’ అనే చిన్న సినిమాతో సంచలనం రేపి.. కమల్ హాసన్‌ లాంటి లెజెండ్‌తో ప్రశంసలు అందుకుని.. ఆయనతో వరుసగా మూడు సినిమాలకు పని చేసిన సంగీత సంచలనం జిబ్రాన్. ‘సాహో’ దర్శకుడు సుజీత్ తొలి చిత్రం ‘రన్ రాజా రన్’కు కూడా మ్యూజిక్ చేసింది అతనే. ఆ మధ్య రిలీజ్ చేసిన ‘సాహో’ సెకండ్ మేకింగ్ వీడియోకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చింది అతనే.

దానికి మంచి స్పందనే వచ్చింది. శంకర్-ఎహసాన్-లాయ్ ‘సాహో’ నుంచి తప్పుకునే సంకేతాలు ఇవ్వగానే జిబ్రాన్‌ను లైన్లో పెట్టాడట సుజీత్. ప్రస్తుతం ట్యూన్స్ ఫైనలైజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. అవి ఓకే అవ్వగానే పాటల చిత్రీకరణ కోసం టీంను తీసుకుని విదేశాలకు వెళ్లిపోతాడట సుజీత్. ఆ తర్వాత బ్యాగ్రౌండ్ స్కోర్ సంగతి చూస్తారు. ఐతే మూడు భాషల్లో పాటలు చిత్రీకరించి, మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి చెప్పినట్లే ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేయాలంటే రేయింబవళ్లు కష్టపడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English