బెల్లంకొండకి ఇంకాస్త పెద్ద చిల్లు పడింది

 బెల్లంకొండకి ఇంకాస్త పెద్ద చిల్లు పడింది

స్టార్‌ దర్శకులకి, హీరోయిన్లకీ కోట్లు చదివించుకుని బెల్లంకొండ శ్రీనివాస్‌ మార్కెట్‌ని బెల్లంకొండ సురేష్‌ ఏర్పరిచాడు. అయితే ఆ మార్కెట్‌ని పైకి తీసుకుని వెళ్లాల్సింది పోయి ప్రతి సినిమాతోను ఇంకాస్త కిందకి పడిపోతున్నాడు. వరుస పరాజయాల మధ్య బెల్లంకొండ శ్రీనివాస్‌ తాజా చిత్రం సీత కూడా ఫ్లాప్‌ బాట పట్టింది. ఈసారి ఈ చిత్రం మరింత పెద్ద ఫ్లాప్‌ అయి అతని భవిష్యత్తుపై క్వశ్చన్‌ మార్క్‌ వేసింది.

మామూలుగా అతని సినిమాలకి తొలి రోజు వచ్చే వసూళ్లని సీత మూడు రోజుల్లో సాధించింది. దీనిని బట్టి అతని సినిమాల పట్ల జనం ఎంతగా ఆసక్తి కోల్పోయారనేది తెలుస్తోంది. కాజల్‌ అగర్వాల్‌ లాంటి స్టార్‌ హీరోయిన్‌ వున్నా, గత చిత్రంతో హిట్‌ ఇచ్చిన తేజ డైరెక్ట్‌ చేసినా కానీ సీత చిత్రానికి కనీసం ఓపెనింగ్స్‌ కూడా రాలేదు. ఇటీవల ఏ సినిమా వచ్చినా కనీసం వారాంతం వరకు అయినా వసూళ్లు రాబడుతోంది.

కానీ సీత చిత్రానికి తొలి వారాంతంలోనే నాలుగు కోట్ల షేర్‌ రాలేదు. పదమూడు కోట్ల వరకు రాబట్టాల్సిన ఈ చిత్రం కనీసం సగానికి పైగా పోగొట్టుకుంటుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక బెల్లంకొండ తదుపరి చిత్రం పది కోట్లు కూడా పలకడం కష్టమేననే టాక్‌ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English