సాహోకి హ్యాండిచ్చి వెళ్లిపోయారు!

సాహోకి హ్యాండిచ్చి వెళ్లిపోయారు!

ఇంకా రెండు పాటల చిత్రీకరణతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బ్యాలెన్స్‌ వున్న సాహో చిత్రానికి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తోన్న త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ సడన్‌గా తప్పుకున్నారు. కారణం ఏమిటనేది తెలియదు కానీ కొత్తగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో సంగీత దర్శకుల పేర్లు లేవు.

ఒకవైపు విడుదల తేదీ ముంచుకొస్తూ వుండగా ఇప్పుడు వీరికి రీప్లేస్‌మెంట్‌ కోసం సాహో నిర్మాతలు ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. తెలుగు సంగీత దర్శకులని వద్దని, నేషనల్‌ వైడ్‌ అప్పీల్‌ కోసమని శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌ని తీసుకోగా వారేమో సమయానికి హ్యాండ్‌ ఇచ్చేసారు. ఎప్పట్నుంచో నిర్మాణంలో వున్న సినిమాకి ఇంతవరకు ట్యూన్లు పూర్తిగా ఇవ్వకపోవడం ఏమిటో మరి? వీరిని హిందీ మ్యూజిక్‌ డైరెక్టర్‌తోనే రీప్లేస్‌ చేస్తారా లేక తెలుగు మ్యూజిక్‌ డైరెక్టర్‌ని సంప్రదిస్తారా అనేది తెలియదు.

విశేషం ఏమిటంటే సంగీత దర్శకుల పేర్లు లేకపోయినా కానీ ఈ పోస్టర్‌పై కూడా రిలీజ్‌ డేట్‌ ఆగస్ట్‌ 15 అని మరోసారి ఖరారు చేసారు. అంటే ఈలోగా తగిన వాళ్లని చూసి సినిమా సకాలంలో పూర్తి చేస్తామని నిర్మాతలు చెప్పకనే చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English