పవన్‌తో ‘అల్లుడా మాజాకా’

పవన్‌తో ‘అల్లుడా మాజాకా’

ఏ సినిమాకైనా టైటిల్‌ చాలా ముఖ్యం. అందునా పెద్ద హీరో సినిమా అంటే ఇంకా కీలకం. టైటిల్‌తోనే సినిమా సగం సక్సెసైనా..ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ విషయంలో కమర్షియల్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ అందరికీ ఆదర్శంగా ఉంటాడు. టైటిల్‌తోనే అదరగొట్టేస్తాడు. అలాగే మరో అగ్రదర్శకుడు త్రివిక్రమ్‌ మాత్రం పవన్‌తో తెరకెక్కిస్తున్న సినిమాకి టైటిల్‌ని నిర్ణయించలేక సతమతమవుతున్నాడు. దీనికోసం అంతా మల్లగుల్లాలు పడుతున్నారు.

‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్‌ ఇప్పటికే విసృ ్తతంగా ప్రచారంలో ఉన్నా ఆ టైటిల్‌ పవన్‌కి అస్సలు నచ్చలేదుట. దాంతో పేరు మార్చే ప్రయత్నంలో ఉన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన హిట్‌చిత్రం టైటిల్‌ ‘అల్లుడా మజాకా’ని ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమా కథాంశం కూడా అత్త, అత్త ఇద్దరు కూతుళ్లు, వారి పనిపట్టే పెంకి అల్లుడు చుట్టూ తిరుగుతుంది గనుక ఈ టైటిల్‌ యాప్ట్‌గా ఉంటుందని దర్శకహీరోలు భావిస్తున్నారట. చిరు సినిమా టైటిల్‌ అంటే ఉన్న క్రేజు కూడా ఈ సినిమాకి కలిసొస్తుందని అంతా అనుకుంటున్నారట. ఏదేమైనా హిట్‌ టైటిల్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందేమో చూడాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు