పాపం ‘ఓటర్’ సినిమా ప్రొడ్యూసర్

 పాపం ‘ఓటర్’ సినిమా ప్రొడ్యూసర్

కోట్లు పెట్టి సినిమా తీస్తాడు నిర్మాత. చిత్ర బృందంలో ఎవరిలో ఎవరికి విభేదాలు వచ్చినా.. సినిమాకు నష్టం రాకుండా చూసుకోవాలి. నిర్మాత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ ‘ఓటర్’ సినిమా హీరో మంచు విష్ణు, దర్శకుడు కార్తీక్ రెడ్డి మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఇద్దరి మధ్య పెద్ద వివాద నడిచింది.

‘అసెంబ్లీ రౌడీ’ స్ఫూర్తితో ఈ స్క్రిప్టును కార్తీక్ తయారు చేసినందుకు గాను తమకు రూ.1.5 కోట్లు ఇచ్చేట్లు ఒప్పందం కుదుర్చుకున్నాడని.. ఆ మొత్తం చెల్లించాల్సిందే అని విష్ణు వర్గీయులు డిమాండ్ చేశారు. కానీ కార్తీక్ దీనికి భిన్నమైన వాదన వినిపించాడు. ఈ కథాకథనాలకు ‘అసెంబ్లీ’ రౌడీకి సంబంధమే లేదని అతనన్నాడు. వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ సినిమా భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారు.

ఒకరినొకరు విమర్శించుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారే తప్ప ‘ఓటరు’ను ఎలా ప్రేక్షకుల ముందుకు తేవాలని అనే ఆలోచించలేదు విష్ణు, కార్తీక్. కానీ నిర్మాత మాత్రం వీరి గొడవను పక్కన పెట్టి సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడంపై దృష్టిపెట్టాడు. ‘ఓటర్’ సినిమాకు సంబంధించిన గొడవ ఏమీ లేదని.. అందరం కలిసి ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని సుధీర్ తెలిపాడు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే కథతో సినిమా తెరకెక్కిందని.. ప్రేక్షకులు ఈ చిత్రంతో బాగా కనెక్టవుతారని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. త్వరలోనే రిలీజ్ చేస్తామని సుధీర్ ప్రకటించాడు. ఇప్పటివరకు అయిన గొడవేదో అయింది.. నిర్మాత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇకనైనా విష్ణు, కార్తీక్ విభేదాల్ని పక్కనపెట్టి సినిమా ప్రమోషన్ మీద దృష్టిపెట్టి సాధ్యమైనంత త్వరగా విడుదల చేయడానికి ప్రయత్నిస్తే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English