డబ్బు కంటే వ్యక్తిత్వమే ముఖ్యం

డబ్బు కంటే వ్యక్తిత్వమే ముఖ్యం

సాయిపల్లవి రెగ్యురల్ హీరోయిన్లకు ఎప్పుడూ భిన్నమే. మిగతా వాళ్లలా రెగ్యులర్ క్యారెక్టర్లు చేయదు. స్కిన్ షోకు ఆమె దూరం. సాయిపల్లవి ఒక పాత్ర ఒప్పుకుందంటే.. అందులో, ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందని జనాలు నమ్ముతారు. వ్యక్తిత్వ పరంగా కూడా సాయిపల్లవి భిన్నం అని పలుమార్లు రుజువైంది. తాజాగా మరోసారి ఆమె తన విలక్షణతను చాటుకుంది.

ఓ ఫెయిర్నెస్ క్రీమ్ ఉత్పత్తిదారు సంస్థ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకోవడానికి ప్రయత్నించిందట. ప్రకటన కోసం ఏకంగా రూ.2 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. కానీ సాయిపల్లవి ఆ అవకాశాన్ని తృణప్రాయంగా వదులుకున్నట్లు సమాచారం. సాయిపల్లవి అసలు తన సినిమాల్లో మేకప్పే వేసుకోదు. సహజంగా ఉండటానికే ప్రయత్నిస్తుంది.

ఒక టైంలో ఆమె ముఖంపై మొటిమల విషయంలో రకరకాల కామెంట్లు కూా వినిపించాయి. కానీ ఆమె అవేమీ పట్టించుకోలేదు. తాను ఎలా ఉన్నానో అలాగే కనిపించే ప్రయత్నం చేసింది. ఈ విషయంలో తనకు ఎలాంటి మొహమాటాలు లేవని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అమ్మాయిలు తమను తాము ఒరిజనల్‌గా ఇష్టపడాలని, అందరూ అలాగే ఇష్టపడేలా చేయాలని.. అలా ఉండటానికే ప్రయత్నించాలని అంటుంది సాయిపల్లవి. ఈ విషయంలో తాను పలుమార్లు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దానికి విరుద్ధంగా ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ చేసి.. అమ్మాయిలకు ఏం సందేశం ఇస్తానా అని సాయిపల్లవి ఆలోచించినట్లుంది.

డబ్బు కంటే వ్యక్తిత్వమే ముఖ్యం అని భావించి రెండు కోట్ల ఆఫర్ పక్కన పెట్టేసింది. ‘పడి పడి లేచె మనసు’ సినిమా ఫ్లాప్ అయినపుడు నిర్మాత బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ ఇవ్వబోతే సాయిపల్లవి తిరస్కరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా రెండు కోట్ల ఆఫర్ వద్దని మరోసారి శభాష్ అనిపించుకుంది సాయిపల్లవి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English