అయ్యా.. మాకో సినిమా కావాలి!

అయ్యా.. మాకో సినిమా కావాలి!

అసలే కటిక సమ్మర్ పైగా రోహిణి కార్తె వచ్చేయడంతో సాయంత్రం 7 గంటలకు కూడా సూర్యుడితాపం చాలా తీవ్రంగా ఉంది. ఈ తరుణంలో జనాలు ఒక ఏసి ధియేటర్లో కూర్చుని కాసేపు నవ్వుకుని కాసేపు హ్యాపీగా ఫీలై కాసేపు ఉద్వేగానికి గురై.. సరదాగా బయటకు వచ్చేద్దాం అనుకుంటారు. మరి వారికి రిలీఫ్‌ ఇచ్చే సినిమా ఇప్పుడు ధియేటర్లలో ఏమన్నా ఉందా?

ఎలక్షన్స్ అయిపోయాయ్. మహర్షి హ్యాంగోవర్ మరియు ఇతర సినిమాల కిక్ అంతా దిగిపోయింది. ఇప్పుడు మనోళ్ళకు ఏదన్నా కొత్త సినిమాయే కిక్కివ్వాలి. ఈ మధ్యకాలంలో మహేష్‌ బాబు సినిమా తరువాత అల్లు శిరీష్‌ ఎబిసిడి అలాగే కాజల్ అగర్వాల్ సీత వచ్చాయి. రెండు సినిమాలూ ఆర్బాటమే కాని కంటెంట్ పరంగా వైవిధ్యంగా అయితే లేవు. అందుకే రెండింటికీ ఆడియన్స్ కరువైపోయారు. ఇకపోతే వచ్చే వారం అభినేత్రి 2, సూర్య ఎన్జీకె, టీజర్ తో ఆకట్టుకున్న ఫలక్నుమా దాస్ సినిమాలు వస్తున్నాయి. వాటిలో ఏవన్నా ఆకట్టుకుంటాయేమో చూడాలి.

నిజానికి ఈ సమ్మర్ అంతా కూడా ఎలక్షన్ల పుణ్యమంటూ అస్సలు సినిమాలు సంగతి పెద్దగా ఎక్కలేదు. కాని ఎలక్షన్స్ అయిపోయాక సినిమాలకు కాస్తే గ్యాప్ ఉంది. ఎందుకంటే మరో రెండు వారాల్లో సమ్మర్ హాలిడేస్ కూడా పూర్తయిపోతాయ్. అయినా కూడా ఈ గ్యాపులో మాకో సినిమాకావాలయ్యా అంటున్నారు మూవీ లవ్వర్స్. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English