ఎంత అరిచినా ఫ్లాప్ సినిమా చూస్తారా?

ఎంత అరిచినా ఫ్లాప్ సినిమా చూస్తారా?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరక్షన్ కంటే కూడా పబ్లిసిటీ విషయంలో మాత్రం దాదాపు ఆస్కార్ విజేతలతో సమానం. ఎందుకంటే ఏదైనా సినిమా వస్తోందంటే ఆయన హడావుడి ఆ రేంజులో ఉంటుంది మరి. ఇప్పుడు మే 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రిలీజ్ చేస్తున్న తరుణంలో మనోడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

నన్ను ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టకుండా మాజీ సీఎం ఆపేశాడో అక్కడే ఇప్పుడు జండాపాతేసి స్టేజీ ఎక్కేసి రచ్చలేపుతా అంటూ బయలుదేరాడు వర్మ. ఆ విషయం పెద్దగా క్లిక్ కాకపోవడంతో ఇప్పుడేమో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ కొత్త సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాలో ఏదో ఎవ్వరికీ తెలియని విషయంలో దుమ్ముదులుపుతా అంటున్నాడు. నిజానికి తన సినిమా రిలీజు టైములో వర్మ ఇలాంటి కొత్త సినిమాలను కోకొల్లలుగా ప్రకటిస్తుంటాడు. వీటన్నింటికీ కనక్ట్ అయిపోయి ఇప్పుడు ఆంధ్ర ప్రజలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూస్తారా?

ఆల్రెడీ ఒక ప్రక్కన చంద్రబాబు నాయుడు ఎలక్షన్లలో దారుణంగా ఓడిపోయిన తరువాత.. ఆయన గురించి నెగెటివ్ గా తీసిన ఒక సినిమాను చూసేంత మూడ్ జనాలకు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఓడిపోయాడు కదా.. ఇప్పుడు ఈ స్టోరీ చూడ్డానికి డబ్బెందుకు ఖర్చు పెట్టడం అనే చిన్న లాజిక్ జనాలను కట్టిపాడేస్తుంది. అవన్నీ ఆలోచించకుండా వర్మ మాత్రం చాలా గట్టిగా అరుస్తున్నాడు. లెటజ్ సీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English