ఎన్టీఆర్ బయోపిక్‌పై తేజ మార్కు కామెంట్

ఎన్టీఆర్ బయోపిక్‌పై తేజ మార్కు కామెంట్

ఎన్టీఆర్ బయోపిక్‌ను తేజ లాంటి దర్శకుడి చేతిలో పెట్టడం ముందు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఈ సినిమా షూటింగ్ కూడా ఆరంభమయ్యాక దీన్నుంచి అతను తప్పుకోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించేదే. బాలయ్యతో తేజకు గొడవలు రావడంతోనే ఆయనీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు గుసగుసలు వినిపించాయి. కానీ తేజ మాత్రం తాను ఈ సినిమాకు న్యాయం చేయలేననే భావనతో తనే స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు ప్రకటించాడు. మామూలుగా తేజ ఎంత ఓపెన్‌గా మాట్లాడతాడో తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ మీద మాట్లాడాల్సి వస్తే తేజ ఎలాంటి బాంబులు పేలుస్తాడో.. బాలయ్య మీద ఎలాంటి సెటైర్లు వేస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ తేజ మాత్రం సింపుల్ కామెంట్‌తో ఇలా ఆశించిన వారిని నిరాశ పరిచాడు. కానీ ‘సీత’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన తేజ.. ఈసారి భిన్నంగా స్పందించాడు.

ఎన్టీఆర్ బయోపిక్ తనకు చాలా మంచి పేరు తెచ్చిందని తేజ వ్యాఖ్యానించడం విశేషం. అసలు ఆ సినిమా తేజ తీయనపుడు పేరు రావడం ఏంటి అని ఆశ్చర్యం కలగడం సహజం. దీనికి తేజ తనదైన శైలిలో భాష్యం చెప్పాడు. ''ఎన్టీఆర్ గారి సినిమాకు న్యాయం చేయలేనేమో అని బయోపిక్‌ నుంచి బయటికొచ్చా. కానీ ఆ సినిమాను నేను డైరెక్ట్‌ చేసుంటే ఔట్‌పుట్‌ అలా వచ్చేది కాదని చాలామంది అన్నారు. ‘మంచి ప్రాజెక్ట్‌ ఎందుకు వదులుకున్నావు.. తప్పు కదా’ అని కొందరు అడిగారు. రిలీజయ్యాక సినిమా చూసి.. ఆ ప్రాజెక్టును వదిలేసి మంచి పనిచేశావన్న వారూ ఉన్నారు. సినిమా తీయకుండా మంచి పేరు రావడం అంటే ఇదేనేమో’’ అని తేజ వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్ ఒక రకంగా ఎన్టీఆర్ బయోపిక్ టీం మీద తేజ వేసిన సెటైర్‌గానే భావించాలి. ఐతే ‘యన్.టి.ఆర్’ సినిమాను వదులుకుని తేజ చేసిన ‘సీత’ సైతం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన నేపథ్యంలో ఆయన మరీ మిడిసిపడటానికేమీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English