ప్రోమోలు కట్ చేయడంలో మాత్రం తిరుగులేదు

ప్రోమోలు కట్ చేయడంలో మాత్రం తిరుగులేదు

‘స్వామి రారా’ లాంటి సెన్సేషనల్ మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు సుధీర్ వర్మ. హాలీవుడ్ సినిమాల ప్రభావం తనపై చాలా ఉందని స్వయంగా చెప్పుకునే సుధీర్.. స్టైలిష్ మేకింగ్‌తో తనదైన ముద్ర వేయాలని చూస్తుంటాడు. అతను ఇప్పటిదాకా మూడు సినిమాలు తీశాడు. అందులో ‘స్వామిరారా’ పెద్ద హిట్. కానీ రెండో సినిమా ‘దోచేయ్’ పెద్ద డిజాస్టర్ అయింది. ‘కేశవ’ విడుదలకు ముందు చాలా హడావుడి నడిచింది కానీ.. అది అంచనాల్ని అందుకోలేకపోయింది. యావరేజ్ అయింది. ఐతే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తన సినిమాలు చాలా స్టైలిష్‌గా ఉండేలా చూసుకుంటాడు సుధీర్. అంతే కాక ప్రోమోలు కట్ చేయడంలో సుధీర్ మార్కే వేరుగా ఉంటుంది.

అంతగా ఆసక్తి రేకెత్తించని కాంబినేషన్లో తెరకెక్కినప్పటికీ ‘స్వామి రారా’పై ప్రేక్షకులు విడుదలకు ముందు ఆసక్తి చూపించారంటే దాని టీజర్, ట్రైలర్లే కారణం. ఇక ‘దోచేయ్’కి సైతం స్టైలిష్ ప్రోమోలు కట్ చేశాడతను. ‘కేశవ’ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అన్నీ అదిరిపోయాయి. కానీ ప్రోమోల రేంజిలో సినిమా లేకపోయింది. ఇప్పుడు సుధీర్.. శర్వానంద్ హీరోగా ‘రణరంగం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీని టైటిల్, ఫస్ట్ లుక్ శనివారమే లాంచ్ చేశారు. ఒక షార్ట్ టీజర్ కూడా వదిలారు. వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముందు రోజు వచ్చిన ప్రి లుక్ సైతం ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఇంటెన్సిటీకి జనాలు ఫిదా అయిపోయారు. సుధీర్ ప్రతి చోటా తన స్టైలిష్ ముద్ర చూపించాడు. ఫస్ట్ లుక్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసింది. మొత్తానికి సినిమాలు ఎలా తీసినా ప్రోమోలు కట్ చేయడంలో మాత్రం సుధీర్‌కు తిరుగులేదని సుధీర్ మరోసారి రుజువు చేసుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English