ఇస్మార్ట్‌లో పోకిరి ట్విస్ట్‌

ఇస్మార్ట్‌లో పోకిరి ట్విస్ట్‌

పూరి జగన్నాథ్‌ పని అయిపోయిందని అనుకున్న ప్రతిసారీ తను ఏమిటనేది ఇంకా బలంగా చూపిస్తూ వచ్చాడు. అయితే ఈమధ్య కాలంలో అతను తీసిన సినిమాలు చూసి ఇక పూరి మళ్లీ లేచే పరిస్థితి లేదనే అనేసుకున్నారు. రాంగోపాల్‌వర్మ రేంజ్‌కి పడిపోకపోయినా కానీ పూరి కూడా పతనం దిశగానే పయనిస్తున్నాడని మెహబూబా లాంటి సినిమాలతో ఒక అంచనాకి వచ్చేసారు. కానీ స్వతహాగా మంచి రైటర్‌ అయిన పూరి ఈసారి తన రైటర్‌ బుర్రకి పదును పెట్టి మంచి కథ రాసాడట. తనయుడిని హీరోగా నిలబెట్టాలని రాసుకున్న ఆ కథ విని ఆకాష్‌పై అది వేస్ట్‌ అయిపోతుందని, ఎవరయినా పేరున్న హీరో వుంటే బాగుంటుందని సన్నిహితులు సూచించడంతో రామ్‌ని అప్రోచ్‌ అయ్యాడు.

రామ్‌తో, అతని పెదనాన్న రవికిషోర్‌తో ఛార్మికి మంచి రిలేషన్‌ వుండడంతో పూరి పని ఈజీ అయింది. ఈ చిత్రం పూరి ఇటీవల తీసిన సినిమాలు అన్నిటికీ భిన్నంగా వుంటుందట. ఊహించని ట్విస్టులతో ఆద్యంతం అలరించేలా సాగుతుందట. క్లయిమాక్స్‌కి ముందు వచ్చే ట్విస్ట్‌ అయితే పోకిరిలో ట్విస్ట్‌ మాదిరిగా పేలిందని చెబుతున్నారు. ఈసారి సినిమా తీసే విషయంలోను పూరి అజాగ్రత్త చూపించడం లేదు. వేగంగా చుట్టేయడం కాకుండా టైమ్‌ తీసుకుని ప్రతి ఫ్రేమ్‌ని సాలిడ్‌గా మలుస్తున్నాడు. ఈ చిత్రంతో పూరి బౌన్స్‌ బ్యాక్‌ అవడంతో పాటు రామ్‌ జాతకాన్ని కూడా మార్చేస్తాడనే ఇన్‌సైడర్స్‌ అంటున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English