ఎన్టీఆర్ రాజకీయారంగేట్రం.. నాని ఆసక్తిర వ్యాఖ్యలు

ఎన్టీఆర్ రాజకీయారంగేట్రం.. నాని ఆసక్తిర వ్యాఖ్యలు

జూనియర్ ఎన్టీఆర్‌తో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ సినీ రంగంలో తొలి అడుగులు వేస్తున్న సమయంలో అతడికి ఎంతో అండగా నిలిచాడు నాని. అందుకే అతడిపై ఎన్టీఆర్‌కు ఎంతో అభిమానం. అతడికి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ దక్కడంలో ఎన్టీఆర్‌ది కీలక పాత్ర అన్నది వాస్తవం. అంతే కాక అతడికి మద్దతుగా ప్రచారం చేసి విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇలా ఒకరికొకరు బాగా సాయం చేసుకున్నారు. కానీ తర్వాత కొన్ని అనూహ్య పరిణామాలు జరిగాయి. నాని టీడీపీని వీడి వైకాపాలో చేరాడు. అయినప్పటికీ ఎన్టీఆర్‌తో అతడి స్నేహం కొనసాగుతోంది. కానీ నానితో సన్నిహితంగా మెలగడం ఎన్టీఆర్‌కు కొంత ఇబ్బందే కాబట్టి ఇద్దరూ ఓపెన్‌గా అయితే కలవట్లేదు. ఇక ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి బంధం మరోసారి చర్చకు వచ్చింది.

తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ పరాభవం ఎదుర్కొంది. అటు వైకాపా భారీ విజయం సాధించి, ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని మంత్రి పదవి కూడా చేపట్టబోతున్నాడు. ఈ తరుణంలో అతను ఎన్టీఆర్ రాజకీయారంగేట్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై సందేహాలు నెలకొని ఎన్టీఆర్ చేతికి ఆ పార్టీ పగ్తాలు అప్పగించే అవకాశంపై ఆసక్తికర చర్చ జరుగుతున్న నేపథ్యంలో నాని కూడా స్పందించాడు. ఇంకో రెండేళ్లలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోతుందని అతను జోస్యం చెప్పాడు. సాధ్యమైనంత త్వరగా ఎన్టీఆర్ చేతికి పార్టీ పగ్గాలు అప్పగించకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదన్నాడు.

2024 నాటికి తెలుగుదేశం పార్టీనే రాష్ట్ర రాజకీయాల్లో ఉండకపోవచ్చన్నాడు. ఐతే ఎన్టీఆర్ ప్రస్తుతం సినీ రంగంలో గొప్ప స్థాయిలో ఉన్నాడని.. అతను ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలని కోరుకోకపోవచ్చని అన్నాడు. సినీ కెరీర్ చరమాంకంలో కానీ అతను రాజకీయాలపై దృష్టిపెట్టకపోవచ్చన్నాడు. ఐతే ఎన్టీఆర్‌కు పగ్గాలు అప్పగించకపోతే తెలుగుదేశం పార్టీ బతికి బట్టగట్టే అవకాశాలే లేవని అతను తేల్చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English