తమన్నా డబుల్ ధమాకా క్యాన్సిల్

తమన్నా డబుల్ ధమాకా క్యాన్సిల్

ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజైన సందర్భాలున్నాయి కానీ.. ఒక హీరో-ఒక హీరోయిన్ కలిసి నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజైన ఉదంతాలు మాత్రం ఇప్పటిదాకా ఎప్పుడూ వినలేదు, కనలేదు. ఈ నెల 31న ఆ చిత్రమే చూడబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ప్రభుదేవా-తమన్నా జంటగా నటించిన రెండు చిత్రాలు, అవి కూడా హార్రర్ జానర్లోవి ఈ నెల 31న రిలీజ్ కానున్నట్లు మీడియాకు సమాచారం అందింది. ‘అభినేత్రి-2’ చాలా ముందే ఈ డేటుకు ఫిక్స్ కాగా.. ఎప్పట్నుంచో విడుదల కోసం చూస్తున్న ‘కామోషి’ అనే చిత్రాన్ని కూడా అదే రోజుకు షెడ్యూల్ చేశారు. ఈ సినిమాల నిర్మాతలిద్దరూ పంతానికి పోవడంతో అవి ఒకే రోజు రిలీజవడం గ్యారెంటీ అనిపించింది. విడుదలకు వారం ఉండగా కూడా ఎవ్వరూ తగ్గలేదు. ఇక పోరు అనివార్యం అనుకున్నారు.

కానీ ఇప్పుడు కథ మారింది. ఇందులో ఒక సినిమాను వాయిదా వేసేశారు. అదే.. కామోషి. గ్రాఫిక్స్ పనుల్లో ఆలస్యం వల్ల సినిమాను జూన్ 14కు వాయిదా వేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కానీ క్లాష్ వద్దనే ఈ చిత్రాన్ని వెనక్కి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఇలా ఒక హీరో హీరోయిన్ నటించిన ఒకే జానర్ సినిమాలు రెంటిని ఒకే రోజు రిలీజ్ చేస్తే రెంటికీ నష్టమే. జనాలు దేనికి వెళ్లాలో తెలియని కన్ఫ్యూజన్లో పడతారు. అంతో ఇంతో ‘అభినేత్రి-2’కే కాస్త బజ్ ఉంది. ‘కామోషి’కి అసలు హైప్ లేదు. అందుకే ఆ చిత్రాన్నే రేసు నుంచి తప్పించినట్లున్నారు. ‘ఈనాడు’.. ‘డేవిడ్ బిల్లా’ లాంటి డిజాస్టర్ సినిమాలు తీసిన చక్రి తోలేటి రూపొందించిన చిత్రం ‘కామోషి’. నయనతార ప్రధాన పాత్రలో అతను డైరెక్ట్ చేసిన మరో సిినిమా విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది. ‘కామోషి’ కూడా చాన్నాళ్లుగా ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా ఆడుతుందన్న భరోసా అయితే లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English